ఈ మునుపటి అనేక బ్లాగులలో(సీర్శిక పట్టీలలో);ఉదాహరణకి: “ది లీకీ బకెట్”: దేవాలయ సభ్యుల హాజరు తగ్గింపు పరిశీలింపు: తొలి ప్రేమ: చర్చిని విడిచి వెళ్ళిన ’సెవెంత్-డే అడ్వెంటిస్ట్ సభ్యుల ప్రారంభ అనుభవాలు: కోల్పోయిన సభ్యుల కొరకు అన్వేషణ : అనే వివిధ అంశాలను పరిశీలించాము. ఏదేమైనా, చర్చి పట్ల జీవితకాల నిబద్ధత కోసం ఎదురుచూస్తున్నప్పుడు యువతను ప్రభావితం చేసే కొన్ని నిర్దిష్ట పోకడలు ఉన్నాయి.
2019 లో విస్కాన్సిన్ లోని ఆస్కాష్లో జరిగిన చోసెన్ ఇంటర్నేషనల్ పాత్ఫైండర్ కాంపోరీ (సిఐసి)(ప్రపంచ నలుమూలలనుండి ఎన్నుకొనబడిన పాత్ఫైండర్ల శిబిరంలో) సెంటర్ ఫర్ యూత్ ఎవాంజెలిజంతో కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మినిస్ట్రీ ఒక అధ్యయనం నిర్వహించింది, ఇందులో 1,024 మంది పాల్గొన్నారు, మొత్తం 993 సర్వేలు పూర్తయ్యాయి. సర్వే ప్రశ్నలలో ఒకటి, “నేను నా స్వంతంగా ఉన్నప్పుడు చురుకైన అడ్వెంటిస్ట్గా ఉండాలని అనుకుంటున్నాను” అనే అంశంపై స్పందించమని యువకులను కోరినప్పుడు, దానికి ఎక్కువ మంది (85%) ప్రతివాదులు వారు పెద్దలుగా అడ్వెంటిస్ట్ చర్చిలో ఉండాలని అనుకుంటున్నామని కొంతవరకు అంగీకరించారు లేదా గట్టిగా అంగీకరించారు.
అదేవిధంగా, “నేను సెవెంత్-డే అడ్వెంటిస్ట్ కాకుండా వేరే వర్గానికి చెందినవాడిని అని నేను ఊహించలేను” అనే ప్రకటనకు ప్రతిస్పందించమని యువకులను కోరినప్పుడు, ఐదుగురిలో దాదాపు నలుగురు (79%) యువకులు ఈ ప్రకటనతో కొంతవరకు అంగీకరించారు లేదా గట్టిగా అంగీకరించారు.
ఈ సంఖ్యలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, రోజర్ డడ్లీ, యొక్క 2000 అధ్యయనం వలన “టీనేజర్స్ చర్చిని ఎందుకు విడిచిపెడుతున్నారు”? అనే ప్రశ్నలకు ఎనిమిది అంశాలను గుర్తించారు. ఈ అంశాలు వారికి ఏ రకమైన టీనేజర్లు తమ స్వంతంగా ఉన్నప్పుడు చర్చిలో ఉంటారు అనేదానిని, అంచనా వేయడానికి సహాయపడగలవు.