ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులపై అడ్వెంటిస్ట్ మరియు క్రిస్టియన్ రేడియో ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేడు, ప్రపంచంలోని అన్ని ఖండాల్లోని వేలాది సెవెంత్-డే అడ్వెంటిస్ట్ రేడియో స్టేషన్‌లతో పాటు, ప్రపంచవ్యాప్తంగా లెక్క లేనన్ని క్రిస్టియన్ రేడియో స్టేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనర్థం, సభ్యులు మరియు సభ్యులు కానివారు-క్రీస్తు అనుచరులు మరియు ఇంకా ఆయనను ఎరుగనివారు-అందరూ రేడియో ప్రసారాల ద్వారా అందించబడిన ఆశ యొక్క స్వరం ద్వారా చేరుకునే అవకాశం ఉంది.
అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో (AWR) అత్యంత ప్రసిద్ధ అడ్వెంటిస్ట్ రేడియో ప్రసారాలలో ఒకటి. వారి లక్ష్యం “క్రీస్తుయొక్క ఆగమన నిరీక్షణను అత్యంత ప్రభావవంతమైన మీడియా ద్వారా ప్రపంచ ప్రజలకు వారి స్వంత భాషలలో ప్రసారం చేయడం. రేడియో ప్రభుత్వ పరిమితులను, సాంస్కృతిక వ్యతిరేకతను, నిరక్షరాస్యతను మరియు భౌగోళిక అడ్డంకులను అధిగమిస్తుంది” [1]. ఇది “షార్ట్‌వేవ్ రేడియో, నేషనల్ రేడియో (జాతీయ రేడియో) రేడియో నెట్‌వర్క్‌లు, స్థానిక FM స్టేషన్‌లు, ఆన్ డిమాండ్ (కోరిక మేరకు), పాడ్‌క్యాస్ట్‌లు మరియు ప్రీ-లోడెడ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది”.[2].
అయితే, AWR మాత్రమే అడ్వెంటిస్ట్ రేడియో స్టేషన్ కాదు. ఇంకా చాలా ఉన్నాయి, వీటిలో:
- కెన్యాలో బారాటన్ FM
- ప్యూర్టో రికోలో రేడియో WZOL
- కెనడాలో VOAR-FM
- హోప్ ఛానల్ ఫిలిప్పీన్స్
- గువామ్‌లో KSDA-FM
- దక్షిణ సూడాన్‌లో రేడియో సాల్వేషన్
- ఉగాండాలో ఎబెనెజర్ FM
- జాంబియాలో రేడియో మారనాతా
- అడ్వెంటిస్ట్ రేడియో ఆస్ట్రేలియా
ఏ రేడియో స్టేషన్‌ను ఉపయోగించినప్పటికీ, ప్రాముఖ్యత అలాగే ఉంటుంది: సువార్త ప్రచారం చట్టం ద్వారా నిషేధించబడిన మరియు కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించబడే ప్రదేశాలలో సువార్త యొక్క శుభవార్తలను ఏకాంతంగా వినడానికి ఈ రకమైన మీడియా (ప్రసార మాధ్యమం) ప్రజలను అనుమతిస్తుంది.
ప్రసార మాధ్యమం
2017–2018 ప్రపంచ చర్చి మెంబర్ సర్వే బృందం వారు (2017–18 GCMS) సర్వేలో పాల్గొనే సభ్యులను, “మీరు ఏ అడ్వెంటిస్ట్ రేడియో ప్రసారాలను ఎంత తరచుగా (చాలా తరచుగా) వింటారు?” అని అడిగారు. అందులో నాలుగో వంతు (29%) మంది ప్రతివాదులు వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు అలా వింటామని నివేదించారు, మరో 12% మంది వారానికి ఒకసారి వింటున్నామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న ఐదుగురిలో ఇద్దరు (42%) అడ్వెంటిస్ట్ రేడియో ప్రసారాలను తాము ఎప్పుడూ వినలేదని అంగీకరించారు.
డివిజన్ ద్వారా డేటా విశ్లేషించబడినప్పుడు, తూర్పు మధ్య ఆఫ్రికా విభాగం నుండి ప్రతివాదులు రోజువారీ అడ్వెంటిస్ట్ రేడియో ప్రసారాలను అత్యధిక స్థాయిలో (31%) వింటున్నట్లు నివేదించారు, తర్వాత ఇంటర్-అమెరికన్ విభాగం (24%). అలాగే, తూర్పు-మధ్య ఆఫ్రికా విభాగం (48%), సదరన్ ఆసియా విభాగం (41%), లేదా ఇంటర్-అమెరికన్ విభాగం (39%) ఇతర వాటి కంటే ఎక్కువ మంది సభ్యులు ప్రతిరోజూ లేదా వారానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు వింటున్నట్లు నివేదించారు. అయినప్పటికీ, ఐదు విభాగాలలో, ప్రతివాదులలో సగం మంది అడ్వెంటిస్ట్ రేడియో ప్రసారాలను ఎప్పుడూ వినలేదని నివేదించారు. 2017–2018 ప్రపంచ చర్చి మెంబర్ సర్వే బృందం వారు (2017–18 GCMS) ఈ సమాచారాన్ని బహిర్గతం చేయనందున, సర్వేలో పాల్గొనేవారి శ్రవణ అలవాట్లను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం.
ఇతర క్రిస్టియన్ రేడియో ప్రసారాలు
2017–2018 ప్రపంచ చర్చి మెంబర్ సర్వే బృందం వారు (2017–18 GCMS) సర్వేలో పాల్గొనే సభ్యులను, “ఇతర క్రిస్టియన్ రేడియో ప్రసారాలను ఎంత తరచుగా వింటారు?” అని కూడా అడిగారు. ప్రతి ఐదుగురిలో ఒకరు (21%) వారు ఇతర క్రిస్టియన్ రేడియో ప్రసారాలను వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు వింటున్నామని నివేదించారు. ప్రతివాదులలో సగం మంది (50%) వారు ఇతర క్రైస్తవ రేడియో ప్రసారాలను ఎప్పుడూ వినరని పంచుకున్నారు.
మళ్ళీ, డేటాను డివిజన్ ద్వారా క్రాస్-టేబుల్ చేయబడినప్పుడు, దక్షిణాసియా విభాగంలో ప్రతివాదులు రోజువారీ శ్రవణంలో అత్యధిక స్థాయి (30%)గా నివేదించారు. ఈ విభాగంలోని సగం మంది ప్రతివాదులు (51%) ఇతర క్రైస్తవ ప్రసారాలను కూడా వింటారు. అయినప్పటికీ, ఐదు విభాగాలలో, 60% లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రతివాదులు ఇతర క్రిస్టియన్ రేడియో ప్రసారాలను ఎప్పుడూ వినలేదని నివేదించారు. 2017–18 GCMS ఈ సమాచారాన్ని బహిర్గతం చేయనందున, సభ్యుల శ్రవణ అలవాట్లపై సంస్కృతి/పర్యావరణ ప్రభావం గురించి మరింత తెలుసుకోవడానికి మరింత పరిశోధన నిర్వహించాలి
ఈ సంఖ్యలు అడ్వెంటిస్ట్/క్రిస్టియన్ రేడియోను ప్రపంచవ్యాప్తంగా అడ్వెంటిస్టులు తక్కువగా ఉపయోగించారని సూచించినట్లు అనిపించవచ్చు, ఈ వనరును ఉపయోగించుకునే వారికి, ఇది ప్రపంచంలోని ఆనందం మరియు ఆశ యొక్క స్థిరమైన మూలం, కొన్నిసార్లు చాలా చీకటిగా అనిపించవచ్చు.. ప్రపంచ చర్చిగా, ప్రతి దేశానికి, తెగకు మరియు భాషకు ధైర్యంగా సువార్తను ప్రకటించే రేడియో స్టేషన్‌లకు మనం మద్దతివ్వడం కొనసాగించాలి (ప్రకటనలు :7:9).
మీరు అడ్వెంటిస్ట్ చర్చి సభ్యులు వినే అలవాట్లను గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి ఈ అంశంపై గతంలో ప్రచురించిన ఈ బ్లాగులను చదవండి.
- ది లైట్ హౌస్ (The Lighthouse)
AWR (అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో) గురించి మరింత సమాచారం కోసం, దయచేసి యీ క్రింది బ్లాగ్ ని సందర్శించండి: https://awr.org/about/
ప్రపంచవ్యాప్తంగా చర్చి సభ్యులకు సంబంధించిన మరిన్ని కొన్ని పరిశోధనల కోసం, దయచేసి మెటా-విశ్లేషణ నివేదికను చూడండి (Meta-Analysis report).
(Institute of Church Ministry) ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది
11-09-2022 తేదీన ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది
[1] ఉచితంగా లోడ్ చేయబడిన) విషయముతో కూడిన సూర్యునినుండి ప్రసరించుచున్న శబ్ద తరంగాల పరికరముల
[2] ఉచితంగా లోడ్ చేయబడిన) విషయముతో కూడిన సూర్యునినుండి ప్రసరించుచున్న శబ్ద తరంగాల పరికరముల