అడ్వెంటిస్ట్ ప్రచురణలు: వినియోగంపై ప్రపంచవ్యాప్త పోకడలు

అడ్వెంటిస్టులు అనేక విభిన్న ప్రచురణలను ఉత్పత్తి చేస్తున్నారు; వీటిలో కొన్ని యూనియన్ లేదా కాన్ఫరెన్స్ (సమావేశం)
స్థాయిలో ఉన్నాయి, మరియు కొన్ని జనరల్ కాన్ఫరెన్స్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ ప్రచురణల ఉద్దేశ్యం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించటానికి , చివరికి మిమ్మల్ని యేసుకు యేసుదగ్గరికి చేర్చడానికి. జనరల్ కాన్ఫరెన్స్ వెబ్‌సైట్ చెప్పినట్లుగా, “సెవెంత్-డే అడ్వెంటిస్ట్ నమ్మకాలు మీ మొత్తం జీవితాన్ని విస్తరించడానికి ఉద్దేశించబడ్డాయి. పరిశుద్ధ గ్రంథాలలో దేవుని ప్రతిమను చిత్రీకరించిన లేఖనాల నుండి వృద్ధి చెందుతూ, మనలను సంపూర్ణంగా మార్చాలని కోరుకునే దేవుని అన్వేషించడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికీ, మరియు ఆయన ప్రేమను అనుభవించడానికి మీరు ఆహ్వానించబడ్డారు.[1]

ఈ ప్రచురణలు సభ్యులను దేవునికి దగ్గరగా తీసుకువస్తాయా? మరియు వారు వారి పూర్తి సామర్థ్యానికి తగినట్లు ఉపయోగించబచున్నారా?

స్థానిక యూనియన్ లేదా కాన్ఫరెన్స్ ప్రచురణలు

2017–2018 ప్రపంచ చర్చి సభ్యుల వీక్షణ బృందం (2017–18 GCMS) సంఘ సభ్యులను తమ స్థానిక యూనియన్ లేదా కాన్ఫరెన్స్ నుండి పత్రికను లేదా వార్తా లేఖను ఎంత తరచుగా చదివారని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా, 6% మంది ప్రతిరోజూ లేదా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు అలాంటి ప్రచురణలను చదివినట్లు నివేదించారు, 7% మంది వారానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు చదివినట్లు నివేదించారు మరియు 12% మంది వారానికి ఒకసారి అలా చేసినట్లు నివేదించారు. అయితే, దాదాపు మూడవ వంతు (31%) యూనియన్ లేదా కాన్ఫరెన్స్-ప్రచురితమైన పత్రికను లేదా వార్తాలేఖను నెలకు ఒకసారి కంటే తక్కువ చదివినట్లు నివేదించారు; ఐదుగురిలో ఇద్దరు (44%) ఎప్పుడూ అలా చేయలేదని నివేదించారు.

డేటాను డివిజన్ (విభజన) ద్వారా పట్టిక చేసినప్పుడు, దక్షిణ ఆసియా విభాగం (SUD) సభ్యులు ఇప్పటివరకు యూనియన్ లేదా కాన్ఫరెన్స్ ప్రచురణలను రోజువారీగా చదివే సభ్యులలో అత్యధిక శాతం (29%) మంది ఉన్నారని నివేదించారు. వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు అటువంటి మ్యాగజైన్‌లు లేదా వార్తాలేఖలను చదివినవారు వారు ఎక్కువగా (18%) ఉన్నారని నివేదించారు.

తూర్పు-మధ్య ఆఫ్రికా విభాగం (55%), దక్షిణ అమెరికా విభాగం (55%), మరియు దక్షిణ ఆఫ్రికా-హిందూ మహాసముద్ర విభాగం (55%) నుండి ప్రతివాదులు తాము యూనియన్ లేదా కాన్ఫరెన్స్-ప్రచురితమైన పత్రికను ఎప్పుడూ చదవలేదని నివేదించే అవకాశం ఉంది. వార్తా లేఖనం ప్రకారం కొంచెం సగానికి పైగా అలా అన్నారు. 2017–18 GCMS అటువంటి ప్రచురణలను పొందటానికి ఉన్న అడ్డంకులను నేరుగా అంచనా వేయలేదు; ఇది మరింత పరిశోధన అవసరమయ్యే ప్రాంతం కావచ్చు.

అడ్వెంటిస్ట్ ప్రపంచ పత్రిక

జనరల్ కాన్ఫరెన్స్ ప్రకారం, “అడ్వెంటిస్ట్ వరల్డ్” (“అడ్వెంటిస్ట్ ప్రపంచం” అనే పత్రిక) 2005లో ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందింది. ఈ పత్రిక ప్రతినెలా ఏడు వేర్వేరు భాషల్లో ముద్రించబడుతుంది. ఇది 140 దేశాలకు ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. డిజిటల్‌గా,( సంకేతికంగా) “అడ్వెంటిస్ట్ వరల్డ్” 12 భాషల్లో అందుబాటులో ఉంది. [2] ఈ పొడిగించిన ప్రాప్యతతో కూడా, ప్రపంచవ్యాప్తంగా 2017–18 GCMS (ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ ) ప్రకారం ప్రతివాదులలో 7% మంది మాత్రమే “అడ్వెంటిస్ట్ వరల్డ్‌ను” ప్రతిరోజూ లేదా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు చదివినట్లు నివేదించారు మరియు ఇదే సంఖ్య (7%) వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు చదివినట్లు నివేదించింది. ప్రతి పది మందిలో ఒకరు (10%) వారు “అడ్వెంటిస్ట్ వరల్డ్‌ని” నెలకు ఒకసారి చదివారని, మరియు పావు వంతు కంటే కొంచెం ఎక్కువ (29%) వారు నెలకు ఒకసారి కంటే తక్కువ చదివారని పంచుకున్నారు. దాదాపు సగం మంది (48%) ప్రతివాదులు అడ్వెంటిస్ట్ వరల్డ్ ని చదవలేదు. రీడర్‌షిప్ (పాఠకుల సంఖ్య) సరళి స్థానిక యూనియన్ లేదా కాన్ఫరెన్స్ పేపర్‌లను చదవడం లాంటిది-మళ్లీ, కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే పత్రికను వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ తరచుగా చదివినట్లు నివేదించబడింది, అయితే ఈసారి ఐదుగురిలో ఇద్దరు కంటే ఎక్కువ మంది వారు దానిని ఎప్పుడూ చదవలేదని చెప్పారు.

డేటాను విభజన ద్వారా క్రాస్-టాబులేట్ చేసినప్పుడు, దక్షిణ ఆసియా విభాగం (SUD) లోని సభ్యులు మళ్లీ “అడ్వెంటిస్ట్ వరల్డ్‌ను” రోజువారీ లేదా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు (37%) లేదా వారానికి ఒకసారి (18%) చదివే అత్యధిక శాతాలను నివేదించారు. ఉత్తర అమెరికా విభాగానికి చెందిన సభ్యులు “అడ్వెంటిస్ట్ వరల్డ్‌ను” నెలకు ఒకసారి కంటే తక్కువ చదివే అవకాశం ఉందనియు (56%), మరియు యూరో-ఆసియా డివిజన్ ప్రతివాదులు (81%) ఎప్పటికీ అలా చేయలేదనియు నివేదించారు.

ఇంత పెద్ద సంఖ్యలో అడ్వెంటిస్టులు ఇలా అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రచురణలు తగినంత సంబంధితంగా లేవా? లేక అవి వారి నిర్దిష్ట భాషలో అందుబాటులో లేవా? సభ్యులకు ఈ ప్రచురణల ఆన్‌లైన్ వెర్షన్ (సాంకేతిక సమాచార ప్రదేశం ) గురించి తెలియదా లేదా వారికి యాక్సెస్ ( అవి పొందు అవకాశం) లేదా? అడ్వెంటిస్టులు ప్రచురణలతో నిమగ్నమవ్వకుండా, ప్రత్యేకించి అవి వారి మాతృభాషలో అందుబాటులో ఉన్నప్పుడు ఏ అడ్డంకులు ఉన్నాయి? ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన ఈ ప్రచురణలను ప్రోత్సహించడానికి అడ్వెంటిస్ట్ చర్చి పరిపాలన ఏమి చేయగలదు? ఈ రచనలను ఉద్దేశపూర్వకంగా మీ జీవితంలో చేర్చుకోవడానికి మీరేమి చేయవచ్చు?


ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది (Institute of Church Ministry).

8/16/23 వ తేదీన ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది.


[1] Seventh-day Adventist Church General Conference. (n.d.). Publications.

https://gc.adventist.org/publications

[2] Seventh-day Adventist Church General Conference. (n.d.). Publications.

https://gc.adventist.org/publications

[3] చిత్ర క్రెడిట్: ఫ్రంట్ కవర్ అడ్వెంటిస్ట్ వరల్డ్ మ్యాగజైన్ https://www.adventistworld.org/august-2023-2/