“ప్రభువు నియమము పరిపూర్ణమైనది, ఆత్మకు నూతనోత్తేజము కలుగజేయును. ప్రభువు శాసనాలు నమ్మదగినవి, అవి సామాన్యులను జ్ఞానవంతులుగా చేస్తాయి. ప్రభువు యొక్క ఉపదేశాలు సరైనవి, హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. ప్రభువు ఆజ్ఞలు ప్రకాశవంతంగా కన్నులకు వెలుగునిస్తాయి.”
కీర్తన 19:7-8 (NIV).
సంబంధాలు ఒకరికొకరు వారి ఆలోచనలు పంచుకోవడంపై నిర్మించబడతాయి: ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సంభాషణలు. మనం ఒకరిని కలిసినప్పుడు, అవతలి
వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి
ప్రయాత్నిస్తాము. మనము వారిని ప్రశ్నలు అడుగుతాము మరియు వారు చెప్పేది వింటాము.
వారు ప్రశ్నలు అడుగుతారు, వాటికి మనము నిజాయితీగా సమాధానం ఇస్తాము.
ఇప్పటికే ఉన్న సంబంధాలను పెంపొందించుకోవడానికి, మనము ఆ పరస్పర సంభాషణలను క్రమంగా కొనసాగించాలి. ఒకరితో ఒకరు సంభాషించడానికి అనేక మార్గాలు ఉన్నాయి: ముఖాముఖిగాను, టెలిఫోన్‌లోను, పాత-కాలపు లేఖల ద్వారాను, మరియు వాస్తవానికి, ఎలక్ట్రానిక్ లేఖల ద్వారాను టెక్స్ట్‌లు, సోషల్ మీడియా, మరియు అనేక విధాలుగా సంభాషించ వచ్చు. ఈ పలువిధమైన మార్గాల ద్వారా మనం అవతలి వ్యక్తి గురించి మరింత నేర్చుకుంటున్నాము మరియు మన గురించి ఎక్కువగా పంచుకుంటున్నాము అనే వాస్తవం కంటే ఏ పద్ధతి ద్వారా సాంభాషిస్తున్నాం అనేది తక్కువ ముఖ్యమైనది
యేసు ఈ లోకంలో మనతోటి తోటి మానవునిగా జీవించిన కొద్ది సంవత్సరాలు మరియు దేవునితో నేరుగా మాట్లాడే వరం పొందిన కొద్దిమంది అదృష్టవంతులు తప్ప, మనం ఆయనతో ముఖాముఖి మాట్లాడలేకపోతున్నాము. . అయితే, ఆయనతో సంభాషించడము అసాధ్యం అని దీని అర్థం కాదు. ఒక మార్గం, వాస్తవానికి, మన హృదయాలలో ఆయన ఆత్మ యొక్క గుసగుసల ద్వారా. మరొకటి, ఆయన సృష్టి యొక్క అద్భుతం మరియు అందం ద్వారా. అంతేగాక ఆయన స్వరాన్ని విన్న కొద్దిమంది ద్వారా మనకు అందించిన ఆయన స్వంత మాటల ద్వారా ఆయన అత్యంత ప్రత్యక్ష సంభాషణ వినగల్గుచున్నాము.
2023 ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ ప్రకారం, వీక్షణ చేయబడిన చర్చి సభ్యులలో సగం కంటే తక్కువ మంది (48.7%) ప్రతిరోజూ బైబిల్ చదువుతున్నారు. మూడవ వంతు కంటే ఎక్కువ (35.9%) వారానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు చదువుతున్నారు. విచారకరంగా, 4.9% మంది దీనిని నెలకు ఒకసారి కంటే తక్కువ చదివారు మరియు 2.4% మంది బైబిల్‌ను అస్సలు చదవరు. సంతోషకరంగా, 2018లో చేసిన వీక్షణతో పోలిస్తే, బైబిల్‌ను ఎప్పుడూ చదవని వారి సంఖ్య 4% నుండి 2.5%కి తగ్గింది మరియు ప్రతిరోజూ చదివే వారి సంఖ్య 48% నుండి 48.7%కి కొద్దిగా పెరిగింది.

దాదాపు సగం మంది సభ్యులు ప్రతిరోజూ దేవుని లేఖలను చదవడం మరియు, మరో పావు మంది వారానికి అనేకసార్లు వాటిని చదువు తున్నారని వినడం ఎంత అద్భుతంగా ఉంది! మన ప్రాణ స్నేహితుడు, మరియు మన పరలోకపు తండ్రితో తిరిగి సన్నిహితంగా ఉండటానికి మిగిలిన వారిని మనం ప్రోత్సహించాలి. మన పట్ల ఆయనకున్న ప్రేమ మరియు శ్రద్ధతో ఆయన లేఖలు ఎంత సంపూర్ణంగా ఉన్నాయో మనం వారికి గుర్తు చేయాలి. ఆయన మనతో సంభాషించడానికి మార్గాలను పునరుద్ధరించాలనుకుంటున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరూ తప్పక తెలుసు కోవాలి.
ఎల్లెన్ వైట్ మన రోజువారీ భక్తితో సహా మంచి అలవాట్లను ఏర్పరచుకోవడానికి మరియు ఉంచుకోవడానికి స్థిరత్వం కీలకమని మనకు గుర్తు చేసింది:
ఈ రోజు రహస్య ప్రార్థన మరియు లేఖనాలను చదవడం విస్మరించబడినప్పుడు, రేపు మనస్సాక్షి యొక్క తక్కువ పునశ్చరణతో వాటిని విస్మరించవచ్చు. లోతు మట్టి లో విత్తిన ఒక్క గింజకు అన్నీ లోపాల జాబితా చాలానే ఉంటుంది. మరోవైపు, ప్రతిష్టాత్మకమైన ప్రతి కాంతి కిరణం కాంతి పంటను ఇస్తుంది. ఒకసారి ప్రతిఘటించిన టెంప్టేషన్ (శోధన) రెండవసారి మరింత దృఢంగా ప్రతిఘటించే శక్తిని ఇస్తుంది; స్వీయ సంకల్పం-పై పొందిన ప్రతి కొత్త విజయం ఉన్నతమైన మరియు గొప్ప విజయాలకు మార్గం సుగమం చేస్తుంది. ప్రతి విజయం నిత్య జీవితానికి నాటిన విత్తనం. (Ellen G. White, Counsels for the Church, 344) (ఎల్లెన్ జి. వైట్, చర్చి కోసం సలహాలు, 344)
మీరు పూర్తి నివేదికను ఇక్కడ పొందవచ్చు.
ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ (సంఘ సంస్థను స్థాపించు శాఖల) సహకారంతో రూపొందించబడింది.
06/05/2024న ASTR ( చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది.