నా చర్చి మరియు సంఘంలో దాని కీర్తి పార్ట్ 2

బ్లాగ్ జూలై 27, 2022

మా చివరి బ్లాగ్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులు స్థానిక సంఘంలో తమ చర్చి పాత్ర మరియు ఖ్యాతిని ఎలా గ్రహిస్తారో మరియు వారి స్థానిక చర్చి సంస్కృతులు, వంశాలు, తెగలు మరియు మతాలు అంతటా సమర్థవంతంగా సమాచారాన్ని అందిచగల సామర్థ్యాన్ని కలిగి ఉందని వారు భావించినట్లు మేము పరిశీలించాము. క్రీస్తును అనుసరించమని వారిని అడగడానికి ముందు సంఘంలోని సభ్యులతో ఖచ్చితంగా వారు ఎక్కడ ఉన్నారో వారితో కనెక్ట్ అవ్వడం యొక్క ప్రాముఖ్యతను మేము చర్చించాము. అయితే, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఇది ఎలా ఉంటుంది?

2017-18 ప్రపంచ సభ్యుల సమగ్ర వీక్షణ బృందం (2017–18 GCMS) సంఘంలోని వ్యక్తులతో వారి పరస్పర చర్యల గురించి మరియు వారి వ్యక్తిగత ఔట్రీచ్ (సభ్యులను చేరుకోవడానికి చేసే) కార్యకలాపాల స్థాయిపై వారి నిజాయితీ వీక్షణల గురించి బహుళ (కొన్ని) ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ప్రతివాదులను కోరింది. ఈ ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి!

ఏడవ దిన సంఘ సభ్యులు కాని వారితో స్నేహాన్ని ఏర్పరచుకోవడం

2017-18 ప్రపంచ సభ్యుల సమగ్ర వీక్షణ లో పాల్గొన్నవారి ని తమ సంఘాలలో అడ్వెంటిస్టులు (ఏడవ దిన సంఘ సభ్యులు) కాని వారితో కొత్త స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి గత 12 నెలల్లో ఎంత తరచుగా సమయాన్ని వెచ్చించారు అని అడిగారు. పావు వంతు (27%) మంది ప్రతివాదులు ప్రతి వారం లేదా అంతకన్నా ఎక్కువ తరచుగా చేస్తున్నట్లు నివేదించారు; మరో 14% మంది గత సంవత్సరంలో, దాదాపు ప్రతి వారం అలా చేశారని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, 22% మంది గత సంవత్సరంలో అడ్వెంటిస్టులు కాని వారితో కొత్త స్నేహాన్ని ఏర్పరుచుకోవడానికి మాత్రమే సమయం గడిపినట్లు అంగీకరించడం ఆందోళనకరం (అంటే ప్రారంభ పరస్పర చర్యలకు ఎటువంటి అనుగమనం ఉండకపోవచ్చు) మరియు 14% “ఎప్పుడూ అలా చేయము” అని అంగీకరించారు. ఈ విధంగా, 53% మంది అడ్వెంటిస్టులు కాని వారితో నెలకు ఒకసారి నుండి వారానికి అనేక సార్లు గడిపారు, మూడవ వంతు (36%) మంది చర్చి వెలుపల వ్యక్తులతో చాలా పరిమితంగా లేదా ఎటువంటి సంబంధాలను కలిగి ఉండరు. బహుశా, వారు చర్చిలో స్నేహితులను కలిగి ఉంటారు, ఈ స్నేహంతో సంతృప్తి చెందుండవచ్చు
మరియు అడ్వెంటిస్టులు కాని వారితో కొత్త సంబంధాలు పెంచుకోవడం అవసరం లేదని యో లేక అది వారి బాధ్యతగా భావించి ఉండరు.

నాన్-అడ్వెంటిస్టుల (ఏడవ దిన సంఘ సభ్యులు కాని వారి) అవసరాలను తీర్చడం

సంఘ సభ్యులను, “మీరు గత 12 నెలల్లో ఎంత తరచుగా మీ సంఘంలోని అడ్వెంటిస్టులు కాని వారి అవసరాలను తీర్చడానికి సమయాన్ని వెచ్చించారు?” అని అడిగినప్పుడు, ప్రమేయం స్థాయిలు ఇంకా తక్కువగా ఉన్నాయి. ప్రతివాదులలో ప్రతి ఐదుగురిలో ఒకరు తాము ప్రతి వారం లేదా దాదాపు ప్రతి వారం ఇతర మతస్థుల అవసరాలు తీరుస్తున్నామనియు, మరొక 11% సహాయ కమ్యూనిటీతో ఎక్కువసార్లు చేశామని చెప్పారు. అయితే, నాలుగో వంతు (అతిపెద్ద వర్గం) వారు గత సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చేసినట్లు నివేదించారు; 17% మంది గత సంవత్సరంలో తమ కమ్యూనిటీలోని అడ్వెంటిస్టులు కానివారి అవసరాలను తీర్చడానికి ఎప్పుడూ సమయాన్ని వెచ్చించలేదని అంగీకరించారు. ఈ చివరి కేటగిరీలు 42% మంది సభ్యులు అరుదుగా లేదా ఎప్పుడూ కమ్యూనిటీ సేవలలో పాల్గొనలేదు.

కొంతమంది సభ్యులు సమాజంలో నాన్-అడ్వెంటిస్టుల (ఏడవ దిన సంఘ సభ్యులు కాని వారి) అవసరాలను మరియు/లేదా వారితో స్నేహాన్ని ఏర్పరచుకోవడంలో నిమగ్నమై ఉండటం సానుకూలంగా ఉన్నప్పటికీ, చాలా మంది సభ్యులు చాలా అరుదుగా నిమగ్నమై ఉంటున్నారు లేదా ఎప్పుడూ అలా చేయడం లేదు అని వినడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. నిజమైన స్నేహాలను ఏర్పరుచుకోవడం అనేది వ్యక్తుల అవసరాలను తెలుసుకోవడానికి మరియు వారు ఉన్న చోట వారి అవసరాలను తీర్చడం అనేది ఉత్తమ మార్గాలలో ఒకటి. మీరు వారిని మరియు వారి అవసరాలను తెలుసుకొని వారికి సహయం అందించిన తర్వాత మాత్రమే మీరు వారిని నిజంగా క్రీస్తుతో సంబంధంలోకి నడిపించగలరు (ఇది మళ్లీ క్రీస్తు పద్ధతిని సూచిస్తుంది).

సంఘంలో పాల్గొనడానికి వ్యక్తిగత ప్రయత్నాలు

స్థానిక కమ్యూనిటీ యొక్క అవసరాలను తీర్చడానికి తమ చర్చి చేస్తున్న కృషిని మార్చడానికి (పెంచడం లేదా తగ్గడం) లేదా సరైన స్థాయిలో ఉన్నారా అని సభ్యులను అడిగినప్పుడు, దాదాపు మూడు వంతుల (70%) సభ్యులు చర్చి యొక్క ప్రమేయం పెంచడం అవసరమని భావించారు. ఐదుగురు (22%) సభ్యుల్లో ఒకరు మాత్రమే తమ చర్చి ప్రయత్నాలు సరైన స్థాయిలో ఉన్నాయని భావించారు.

ప్రశ్న మరింత వ్యక్తిగతంగా మారినప్పుడు, స్థానిక కమ్యూనిటీ యొక్క అవసరాలను తీర్చడానికి వారి స్వంత ప్రమేయం (పెరుగుదల లేదా తగ్గింపు) లేదా సరైన స్థాయిలో ఉందా అని సభ్యులను అడిగినప్పుడు, ప్రతివాదులు (72%) తమకు అవసరమని అంగీకరించారు. వారి ప్రమేయాన్ని ఒక డిగ్రీ లేదా మరొక స్థాయికి పెంచాలి అన్నారు. మళ్ళీ, ఐదుగురిలో ఒకరు (19%) తమ ప్రయత్నాలు సరైన స్థాయిలో ఉన్నాయని భావించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యులు సంఘంలో మరియు/లేదా అడ్వెంటిస్టులు కానివారి తో చర్చి స్థాయిలో మరియు వ్యక్తిగతంగా పరస్పర చర్యను పెంచాల్సిన అవసరాన్ని చూడటం ప్రోత్సాహకరంగా ఉంది. స్థానిక చర్చిలలో మరింత క్రీస్తు పద్ధతిని మరియు స్నేహ సువార్తను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పాస్టర్లు మరియు ఇతర చర్చి నాయకత్వం సభ్యులకు వాటిని ఎలా అన్వయించాలో నేర్పించాలి మరియు చర్చి స్థానిక సంఘంతో సానుకూల పరస్పర చర్యలను కలిగి ఉండటానికి మరియు చర్చి వెలుపల ఉన్న వారితో సంబంధాలను పెంపొందించడానికి అవకాశాలను వెతకాలి; అలాచేస్తే, బాధ్యత అంత వారి భుజాలపై పడదు. మరియు చర్చి వెలుపల ఉన్న వారితో స్నేహంగా సంబంధాలను పెంపొందించి వారిని సంఘంలోనికి ఆహ్వానించడానికి కావలసిందల్లా, క్రీస్తు నందు పూర్తిగా విశ్వసించి బాధ్యత తీసుకోగలిగిన ఒక్క వ్యక్తి మాత్రమే.

మీరు ఆ రి రిస్క్ (బాధ్యత) తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?

మొత్తం నమూనాపై మరిన్ని పరిశోధన ఫలితాల కోసం, దయచేసి మెటా- ఎనాలిసిస్ రిపోర్ట్ ను (మెటా-విశ్లేషణ నివేదికను) చూడండి (Meta-Analysis report).


(Institute of Church Ministry) ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది

07-27-2022న ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది


Image credit: Diverse group photo created by rawpixel.com – www.freepik.com