దేనినిగూర్చి చింతించకుడి గాని ప్రతి విషయములోను కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన మరియు విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మరియు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము క్రీస్తుయేసునందు మీ హృదయములను మరియు మీ మనస్సులను కాపాడును. ఫిలిప్పీయులు 4:6–7 (NIV)
పైన ఫిలిప్పియన్స్‌లోని వచనంలో, దేని గురించి చింతించవద్దని పౌలు తన పాఠకులకు చెప్పాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా కోవిడ్-19 మహమ్మారి వలన అపూర్వమైన ఒత్తిడి మరియు సంక్షోభం ఏర్పడింది. యుద్ధాలు మరియు ఆర్థిక సంక్షోభం వంటివి ప్రతిదానిపైనా దూసుకుపోతోంది. 2022లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ " కోవిడ్-19 మహమ్మారి యొక్క మొదటి సంవత్సరంలో, ఆందోళన మరియు నిరాశ యొక్క ప్రపంచ ప్రాబల్యం 25% భారీగా పెరిగింది" అని క్లుప్తంగా పేర్కొంది. ప్రజల ఆరోగ్యం మరియు పని సామర్థ్యంపై ప్రభావం చూపడంతోపాటు, ఈ పెరుగుదలకు ప్రధాన కారణం మనమందరం బాధపడాల్సిన సామాజిక ఒంటరితనం. మహమ్మారి ఇప్పటికీ ఊహించని రీతిలో మన జీవితాలను మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని ఇటీవలి అధ్యయనాలు చూపిస్తున్నాయి.
కష్ట సమయాలు ఉన్నప్పుడు, మనం మన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మద్దతు అందుకోవాలి మరియు, మనము అదే విధంగ వారికి మద్దతు ఇవ్వాలి. ఫిలిప్పీయులలోని వచనం ఇలా చెబుతోంది, "ప్రతిదానిలో ప్రార్థన మరియు ప్రార్థన విన్నపాల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి."

2023 ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణలో, 64.2% మంది చర్చి సభ్యులు రోజుకు ఒక్కసారైనా ప్రార్థనలు చేస్తారని చెప్పారు. దాదాపు 16.4% మంది వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రార్థించారు; మరియు 11.4%, వారానికి ఒకసారి మరియు నెలకు ఒకసారి. దురదృష్టవశాత్తు, 8.1% మంది సభ్యులు నెలకు ఒకసారి కంటే తక్కువ లేదా ఎప్పుడూ ప్రార్థించలేదు.

ఈ ప్రార్థన భోజన సమయాల్లో మనం తినబోయే వాటిపై భగవంతుని ఆశీర్వాదం కోసం అర్ధించే లాంటిది కాదు. ఈ వీక్షణ లోని ప్రార్థనల ద్వారా అందించబడిన సారాంశం ఏమిటంటే, ఆయన లేఖనాలలో మనకు ఆయన అందించిన సందేశాలకు మునము ప్రతిస్పందించినప్పుడు, మరియు హృదయ భారాన్ని తగ్గించనమని ప్రాధేయపదినప్పుడు లేదా ఆయనకు మన హృదయాలను అప్పగించినప్పుడు చేసే సంభాషణ ప్రార్థనలు.
మనం మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మన భయాలు, మన ఆందోళనలు, మన కోపం, మన విచారం వినడానికి ఆయన ఎప్పుడూ బిజీగా లేడు(తీరిక లేకుండా లేడు). ఏ సమస్య అయినా ఆయనకి అది చాలా చిన్నది లేదా చాలా ఆసక్తికరంగా లేకుండా ఉండదు. ఆయన మన మొర వినడమే కాదు, మన ఆందోళన మరియు భయాలను శాంతింపజేయడం ద్వారా

ప్రతిస్పందిస్తాడు. ఫిలిప్పీయులు ఇలా ముగించారు: "అన్ని అవగాహనలను మించిన దేవుని శాంతి మీ హృదయాలను మరియు మీ మనస్సులను క్రీస్తుయేసునందు కాపాడుతుంది."
స్టెప్స్ టు క్రైస్ట్‌లో (“క్రీస్తు వైపు అడుగులు”అనే పుస్తకం లో), ఎల్లెన్ వైట్ దానిని అందంగా సంగ్రహించి, ఇలా చెప్పింది.:
“మీ కోరికలు, మీ సంతోషాలు, మీ బాధలు, మీ శ్రద్ధలు మరియు మీ భయాలను దేవుని ముందు ఉంచండి. మీరు ఆయన పై భారం వేయలేరు; మీరు ఆయనను అలసట పరచలేరు. ... మనస్సును కలవరపరిచే ప్రతిదాన్ని ఆయన వద్దకు తీసుకెళ్లండి. ఆయన భరించలేనంత గొప్పది ఏదీ లేదు, ఎందుకంటే అతను లోకాలను ఏలువాడు. ఆయన విశ్వంలోని అన్ని వ్యవహారాలను పరిపాలిస్తాడు. మన శాంతికి సంబంధించిన ఏదీ ఆయన గమనించలేనంత చిన్నది కాదు.ఠ (ఎల్లెన్ జి. వైట్, స్టెప్స్ టు క్రైస్ట్, 100)
మీరు పూర్తి నివేదికను ఇక్కడ పొందవచ్చు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది.
06/19/2024న ASTR ( చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం ద్వారా ప్రచురించబడింది).
[1] World Health Organization. 02/03/2022. https://www.who.int/news/item/02-03-2022-covid-19-pandemic-triggers-25-increase-in-prevalence-of-anxiety-and-depression-worldwide
[2] Baylor University. 2/2/2024. https://news.web.baylor.edu/news/story/2024/days-blur-together-study-shows-how-covid-19-pandemic-affected-perceptions-time-and