“నేను సువార్త కొరకు అన్నింటినీ చేస్తాను, దాని ఆశీర్వాదాలను నేను వారితో పంచుకుంటాను.” – 1 కొరింథీయులు 9:23 (ESV)
“కాబట్టి, ప్రభువు కొరకు ఖైదీగా ఉన్న నేను, మీరు మీకు వచ్చిన పిలుపుకు తగిన విధంగా నడుచుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను . . .” – ఎఫెసీయులు 4:1 (ESV)
పరిచర్యలో పని చేయడం-సామర్థ్యం ఏమైనప్పటికీ-దేవుని పిలుపుపై ఆధారపడి ఉండాలనే విషయాన్ని తిరస్కరించలేము. ఈ పిలుపునే కష్ట సమయాల్లో నాయకులను నిలబెట్టి, మంచి సమయంలో వారిని ప్రోత్సహిస్తుంది.
2017-2018లో చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం (ఆర్కైవ్స్, స్టాటిస్టిక్స్ మరియు రీసెర్చ్ కార్యాలయం) మద్దత్తుతో జనరల్ కాన్ఫరెన్స్ ద్వారా నియమించబడిన 2వ చర్చి నాయకత్వ వీక్షణ లో చర్చి నిర్వాహకుని వివిధ అంశాలను మరియు అనుభవాలను పరిశీలించింది. ఈ వీక్షణ 13 ప్రపంచవ్యాప్త విభాగాలు (మరియు జనరల్ కాన్ఫరెన్స్‌తో సహా) 15 విభిన్న సంస్థలలో నిర్వహించబడింది. (ప్రతివాదులలో 1% కంటే తక్కువ మంది ఉత్తర అమెరికా విభాగానికి చెందినవారని గమనించాలి.)
పిలుపు
అడ్వెంటిస్ట్ నాయకులలో మెజారిటీ (ఎక్కువ శాతం) (67%) వారు తమ పాత్రలో ప్రభావవంతంగా ఉన్నారని భావించారని పరిశోధనా బృందం నివేదించింది, మరో 18% వారు మధ్యస్తంగా ప్రభావవంతంగా ఉన్నారని నివేదించారు. అదనంగా, చాలా మంది (84%) చర్చి నాయకులు తమ ఆధ్యాత్మిక బహుమతులు చర్చిలో వారి ప్రస్తుత పాత్రలో పెద్దగా లేదా చాలా పెద్ద స్థాయిలో ఉయోగించబడుతున్నాయని భావించారు. ఈ సంఖ్యలు భరోసానిస్తాయి, ఎందుకంటే చాలా మంది అడ్వెంటిస్ట్ నాయకులు వారు పిలువబడిన మరియు వారి తలాంతులను వినియోగించ గలిగిన ప్రాంతాల్లో పని చేస్తున్నారని సూచిస్తున్నాయి.
అడ్వెంటిస్ట్ చర్చి నాయకులను కూడా యేసుతో వారి సంబంధం గురించి అడిగారు. అత్యధికులు (85%) యేసుతో సన్నిహిత/చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్లు నివేదించారు. అడ్వెంటిస్ట్ చర్చి నాయకత్వంలో ఎక్కువ శాతం మంది యేసుతో తమ సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వడం ఒక ఆశీర్వాదం; వారు ఆయనతో చాలా లోతుగా సంభందం కలిగిఉన్నారని భావించడం ప్రోత్సాహకరంగా ఉంది.
ధర
అయితే, చర్చి నాయకత్వ శాఖలో పని చేయడం ఖర్చుతో కూడుకున్నదని తిరస్కరించలేము. 2017–18 చర్చి నాయకత్వ వీక్షణ శాఖలో వారు అనుభవించే కొన్ని ఖర్చుల గురించి చర్చి నాయకులను అడిగారు. ఐదుగురిలో ఒకరు (20%) నాయకులు తమ కుటుంబం పరిచర్యలో పాల్గొనడం వల్ల పెద్దగా లేదా చాలా పెద్ద స్థాయిలో బాధపడుతుందని నివేదించారు. మూడవ వంతు (36%) మంది తమ కుటుంబం ఒక మోస్తరు స్థాయిలో బాధపడుతున్నారని పంచుకున్నారు. ఆ విధంగా, చర్చి నాయకులలో ఎక్కువమంది (56%) తమ కుటుంబాలు తమ పరిచర్య కారణంగా పెద్దగా, చాలా పెద్దగా లేదా మితమైన స్థాయిలో బాధపడ్డారని చెప్పారు. మిగిలిన 44% మంది నాయకులు తమ కుటుంబం చిన్న లేదా చాలా తక్కువ స్థాయిలో బాధపడుతున్నారని అంగీకరించారు.
“పిలుపు నిమిత్తము” కుటుంబాలు కష్టాలను అనుభవించినప్పటికీ, ఒక శుభవార్త ఉంది. చర్చి నాయకులను వారి కుటుంబాలు వారి పరిచర్యలో ఏ మేరకు మద్దతిస్తాయో అడిగినప్పుడు, దాదాపు అందరూ (96%) తమ కుటుంబాలు తమకు పెద్దగా లేదా చాలా పెద్ద స్థాయిలో మద్దతు ఇస్తున్నాయని పంచుకున్నారు. యేసు పిలుపుకు కూడా కట్టుబడి, దాని ఫలితంగా మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందించే కుటుంబాలు ఉండడం ఎంతటి ఆశీర్వాదకరం!
యోగ్యమైనది!
చర్చి నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తరచుగా పరిచర్యలో పాల్గొనడానికి అయ్యే ఖర్చును అనుభవిస్తున్నప్పటికీ, యేసు యొక్క పిలుపు ఈ ప్రపంచంలోని అసౌకర్యాలను మరియు పరీక్షలను అధిగమిస్తుంది. కుటుంబ సభ్యులు చర్చి నాయకులకు మద్దతునిచ్చినప్పుడు, అది వారి భారాన్ని తగ్గించి, రాజ్యం కోసం సేవను మరింత మధురంగా చేస్తుంది. పిలుపు ఖర్చు కంటే ఎక్కువగా ఉందా? ఖచ్చితంగా!
పూర్తి ప్రదర్శనను చూడటానికి, ఇక్కడ సందర్శించండి.
Created in collaboration with the Institute of Church Ministry
Published by ASTR on 12/14/2022