విసుగు చెందారా, లేదా శక్తివంతంగా ఉన్నారా?: వయస్సు వ్యత్యాసం ఆరాధన అనుభవాన్ని ఎలా మెరుగుచేస్తుందోచూద్దాం

బ్లాగ్ మార్చి 13, 2024

మరొక తరం సభ్యులు, మీ కంటే పెద్దవారు లేదా చిన్నవారు, మీ చర్చిలో ఆరాధన అనుభవం గురించి ఎలా ఆలోచిస్తారు మరియు అనుభూతి చెందుతారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కాకపోతే, చర్చి సభ్యుల వ్యక్తిగత ఆరాధన అనుభవాలను చర్చి సభ్యుల కార్యకలాపాలను ఒక దశాబ్దానికి పైగా పరిశీలించి చేసిన పరిశోధన ప్రకారం ఇది మీ చర్చి పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. 

ఉత్తర అమెరికాలోని 20,649 అడ్వెంటిస్ట్‌ల నమూనాలో, చర్చికి హాజరవుతున్నప్పుడు వారి ఆధ్యాత్మిక సంబంధం, నిశ్చితార్థం, నిరీక్షణ, ప్రేరణ మరియు ఆనంద భావనలో వయస్సు సమూహాలలో ముఖ్యమైన మరియు బలవంతపు వ్యత్యాసాలను ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణబృందం వెల్లడించింది.

ఆరాధన సేవలో అర్థవంతమైన రీతిలోఎంతవరకు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో పాల్గొన్న వారిని సంఘ సభ్యుల వీక్షణబృందం  అడిగింది. 

వృద్ధాప్య సభ్యులు (51 నుండి 70 మరియు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారిని) చిన్న వయస్సు  సమూహాలకు విరుద్ధంగాఅధిక శాతం సంబంధాలను స్థిరంగా నివేదించారు.  ఇది ఆరాధన సేవ సమయాలలో ప్రజలు అనుభవించే ఆధ్యాత్మిక సంబంధం యొక్క లోతులో తరాల అంతరాన్ని సూచిస్తుంది.

అదేవిధంగా, ఆరాధన సేవ వారి జీవితాల్లో సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పెద్దలు స్థిరంగా నివేదించారు, అయితే యువ చర్చి సభ్యులు అదే అభిప్రాయాన్ని కలిగి ఉండే అవకాశం తక్కువ.

ప్రసంగాల గురించి ఆలోచిస్తూ, పాత చర్చి సభ్యులు వారు ప్రసంగాలు వినడం ఆనందించారని మరియు అది వారి వ్యక్తిగత పరిస్థితితో సహసంబంధం కలిగి ఉన్నదని నివేదించారు, అయితే చాలా తక్కువ మంది యువకులు అదే విధంగా భావించారు.

సంగీతాన్ని ఆస్వాదించడం, ప్రసంగాల ద్వారా ప్రేరణ పొందడం మరియు చర్చి ఆరాధనలు ఆశించడం విషయానికి వస్తే వయస్సు తేడాలు అదే పద్ధతిలో కొనసాగుతాయి. పాత చర్చి సభ్యులు సాధారణంగా సంగీతాన్ని ఇష్టపడతారు, సేవను స్ఫూర్తిదాయకంగా భావిస్తారు మరియు చర్చి ఆరాధన కోసం ఎదురు చూస్తారు. యువకులు ఆరాధన (ప్రసంగాన్ని) వినడం ద్వారా విసుగు , చెందుతున్నారని, ప్రసంగం నుండి ప్రేరణ పొందలేదని నివేదిస్తున్నారు మరియు చర్చికి వెళ్లడానికి ఎదురుచూడరు.

తరాలు కూడా చర్చి వాతావరణాన్ని భిన్నంగా అనుభవిస్తాయి. “మా చర్చిలో చాలా ఆనందం మరియు నవ్వు ఉంది” అనే ప్రకటనకు ప్రతిస్పందిస్తూ, 43% మంది పెద్ద వయసు  ప్రతివాదులు గట్టిగా అంగీకరించారు, అయితే యువ బృందంలో 24% మంది మాత్రమే ఆ  ప్రకటనతో ఏకీభవించారు.

చర్చి హాజరులో సంతృప్తిని పొందాలంటే, యువకుల కొరకు, ముఖ్యంగా  ఆరాధన విషయంలో బలహీనంగా ఉన్న యువకుల కొరకు, భిన్నమైన ఆరాధన విధానం అవలంభించటం చాల అవసరం.   

ఆధ్యాత్మిక సంబంధం యొక్క లోతు నుండి ఉపన్యాసాలు మరియు సంగీతం యొక్క ప్రభావం వరకు, అలాగే విసుగు, నిరీక్షణ, ప్రేరణ మరియు సామూహిక ఆనందం యొక్క భావోద్వేగ స్పెక్ట్రం (వర్ణ విశ్లేషణము), వరకు, ఆరాధన సేవలో వ్యక్తిగత దృక్కోణాలను రూపొందించడంలో వయస్సు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అసమానతలను గుర్తించడం ద్వారా ఆరాధన అనుభవాలను  మెరుగుపరచడానికి,  వ్యూహాలను మెరుగుపరచడానికి మరియు ప్రతి వయస్సు వారి ప్రత్యేక అవసరాలు మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా, తరతరాలుగా అర్ధవంతమైన ఆరాధన అనుభవాలను పెంపొందించడంలో సూక్ష్మమైన విధానానికి దోహదపడే వ్యూహాలను మెరుగుపరచడానికి ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది.  

మీ స్థానిక చర్చిలో చర్చి సభ్యులు ఆరాధనను ఎలా అనుభవిస్తారో మీకు తెలుసా?

యువ తరాల ఆరాధన అనుభవాన్ని మెరుగుపరచడానికి సభ్యులు మరియు నాయకులు ఒకే విధంగా ఏమి చేయవచ్చు?

స్టెప్స్ టు క్రైస్ట్, 11వ అధ్యాయంలో, ఎల్లెన్ వైట్ ఇలా వ్రాశింది:  మన దేవుడు సున్త్నిత మనస్కుడు, దయగల తండ్రి. ఆయనసేవను హృదయాన్ని బాధించే, బాధ కలిగించే వ్యాయామంగా చూడకూడదు. భగవంతుని ఆరాధించడం మరియు ఆయన పనిలో పాలుపంచుకోవడం మనకి ఆనందంగా ఉండాలి.  తన పిల్లలకి ఇంత గొప్ప మోక్షం అందించిన దేవుడు, తాను కఠినమైన, ఖచ్చితమైన కార్యనిర్వాహకుడిలా ఎలా ప్రవర్తిస్తాడు? ఆయన వారి ఆప్త మిత్రుడు; మరియు వారు ఆయనను ఆరాధించినప్పుడు, వారి హృదయాలను ఆనందం మరియు ప్రేమతో నింపి, వారిని ఆశీర్వదించడానికి మరియు ఓదార్చడానికి ఆయన వారితో ఉండాలని ఆశిస్తాడు. ప్రభువు తన పిల్లలు తన సేవలో ఓదార్పు పొందాలని మరియు తన పనిలో కష్టాల కంటే ఎక్కువ ఆనందాన్ని పొందాలని కోరుకుంటాడు. తనను ఆరాధించడానికి వచ్చిన వారు తన సంరక్షణ, మరియు ప్రేమ గురించి విలువైన ఆలోచనలను తమతో తీసుకువెళ్లాలని, వారి రోజువారీ జీవితంలోని అన్ని ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉండాలని, వారు అన్ని విషయాలలో నిజాయితీగా మరియు నమ్మకంగా వ్యవహారించి దయ కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.

అన్ని వయసుల వారికి ఆరాధనను ఆనందదాయకంగా మరియు విశ్వాసాన్ని పెంపొందించే అనుభవంగా మార్చడానికి మనం కలిసి పని చేద్దాం.

ఈ పని ఎంత కష్టంగా అనిపించినా, పరిశుద్ధాత్మ మార్గనిర్దేశంతో, బైబిల్ సూత్రాలను ప్రాపంచిక సూత్రాలతో రాజీ పదనీయకుండాసాధించడం సాధ్యమవుతుంది.

See Meta-Analysis Report

ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది.

03/13/2024న ASTR (చరిత్ర, గణాంకాలు మరియు పరిశోధన దస్తావేజులు భద్రపరుచు కార్యాలయం)  ద్వారా ప్రచురించబడింది.