2022-23 ప్రపంచ సంఘ సభ్యుల సర్వే (2022-23-GCMS) ప్రపంచవ్యాప్తంగా పరిశోధన బృందాల సహాయంతో ఆర్కైవ్స్, స్టాటిస్టిక్స్ మరియు రీసెర్చ్ జనరల్ కాన్ఫరెన్స్ ఆఫీస్ (ASTR) (జనరల్ కాన్ఫరెన్స్ ఆఫీస్ కి చెందిన చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) కోసం గత పదేళ్లలో నిర్వహించిన పన్నెండు ప్రపంచవ్యాప్త సర్వేలలో యిది ఒకటి. ఈ సర్వే పది సంవత్సరాల క్రితం ప్రపంచ పరిశోధన ప్రారంభమైనప్పటి నుండి సేకరించిన అతిపెద్ద డేటా సెట్.
జనరల్ కాన్ఫరెన్స్ ద్వారా నియమించబడిన మొదటి ప్రపంచ సంఘ సభ్యుల సర్వే 2013లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా బృందాలచే నిర్వహించబడింది. ఆరు ఖండాలలోని తొమ్మిది విభాగాల నుండి దాదాపు 26,000 మంది అడ్వెంటిస్ట్ చర్చి సభ్యులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఈ అధ్యయనం యొక్క ఫలితాలు 2013 చివరలో వార్షిక కౌన్సిల్ (సమావేశం) సందర్భంగా పంచుకున్నప్పుడు, అడ్వెంటిస్ట్ చర్చి ఎలా పని చేస్తుందో అంచనా వేయడానికి ఇటువంటి పరిశోధనలు అవసరమని మరియు చర్చి యొక్క మిషన్‌ను మెరుగుపరచడానికి వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నాయకులు గ్రహించారు. ఇవి విభాగం నివేదికలు పరిశోధన వెబ్‌సైట్ (adventistresearch.info)లో ప్రచురించబడ్డాయి. అదనంగా, మే 2016 నుండి, ఈ అధ్యయనం యొక్క ఫలితాల అవగాహన పెంచడానికి ఆన్‌లైన్‌లో (కంప్యూటర్ ద్వారా) పరిశోధన వార్తాలేఖలు మరియు బ్లాగ్‌లలో భాగస్వామ్యం చేయబడ్డాయి.
రెండవ గ్లోబల్ చర్చ్ మెంబర్ సర్వే 2017 మరియు 2018లో జరిగినప్పుడు, మొత్తం 13 డివిజన్‌ల నుండి చర్చి సభ్యులు 63,756 మొత్తం చెల్లుబాటు అయ్యే ప్రతిస్పందనలతో ఇందులో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొనే వారి సంఖ్య రెండు
రెట్టింపుల కంటే ఎక్కువ.

డేటా(కంప్యూటర్‌లోకి పంపించబడిన పరిమాణాలు) వెబ్‌సైట్‌లో వ్యక్తిగత డివిజన్ (విభాగం) నివేదికలుగా మరియు మొత్తంగా “మెటా-విశ్లేషణ నివేదిక”గా ప్రచురించబడింది, ఇది ప్రపంచ దృష్టికోణం నుండి పరిశోధన ఫలితాలను మరియు “రీచ్ ద వరల్డ్” (ప్రపంచాన్ని చేరుకోండి) అనే వ్యూహాత్మక ప్రణాళిక యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టింది.
చర్చి నాయకులు, పాస్టర్లు మరియు సాధారణ సభ్యులు మా వెబ్‌సైట్‌లో ఎవరికైనా అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా సెట్, కనుగొన్నవి, అదనపు క్రాస్‌స్టాబులేషన్‌లు మరియు సహసంబంధాలను మెచ్చుకున్నారు. సర్వే ఫలితాలు చర్చి పత్రికలు, పుస్తకాలు, పరిశోధన బ్లాగులు మరియు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచురించబడ్డాయి.
మూడవ ప్రపంచ చర్చి సభ్యుల సర్వే 2022 మరియు 2023లో పూర్తయింది. పరిశోధకులు చాలా కష్టపడి పనిచేశారు మరియు వ్యాపించిన అంటువ్యాధి కారణంగా సమాచారం సేకరణలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.
చివరగా, ప్రపంచ డేటా సెట్ పూర్తయిన తర్వాత, 149,556 చెల్లుబాటు అయ్యే ప్రతిస్పందనలు లెక్కించబడ్డాయి.

చాలా మంది అడ్వెంటిస్ట్ చర్చి సభ్యులు ఈ సర్వేలో పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మొత్తం 13 డివిజన్‌లు మరియు రెండు అనుబంధ ఫీల్డ్‌ల (ప్రాంతాల) నుండి సభ్యులు ఈ విస్తృతమైన మరియు కీలకమైన సర్వేను (వీక్షణను) పూర్తి చేయడానికి సమయాన్ని వెచ్చించారు.
ఈ ముఖ్యమైన పరిశోధన ప్రాజెక్ట్‌లో, ప్రతివాదులు మరియు పరిశోధకులందరికీ వారి కృషి నిమిత్తమై హృదయపూర్వక ధన్యవాదాలు.
తుది డివిజన్ (విభాగం) నివేదికలు మరియు మెటా-విశ్లేషణ నివేదిక త్వరలో పరిశోధన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ఈ అధ్యయనం నుండి పొందిన అంతర్దృష్టులు యేసుక్రీస్తుతో మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు సహాయపడును గాక.
1/24/2024 తేదీన ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను
భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది.