ట్రాన్స్-యూరోపియన్ (మధ్య- యూరోపియన్) మరియు ఇంటర్-యూరోపియన్ (అంతర్- యూరోపియన్) విభాగంలో క్రీస్తు పద్ధతి.

బ్లాగ్ డిసెంబర్ 22, 2021

మత్తయి 9:9-13లో, యేసు మాత్యుని (మత్తయిని) తన శిష్యుడిగా పిలిచిన కథను మనం కనుగొంటున్నాము.:

“యేసు అక్కడినుండి వెళ్తుండగా, మత్తయి అనే వ్యక్తి పన్ను వసూలు చేసే బూత్ (గుడారం) వద్ద కూర్చోవడం చూశాడు. “నన్ను అనుసరించు,” అని ఆయన అతనికి చెప్పాడు, మరియు మత్తయి లేచి యేసును అనుసరించాడు. యేసు మత్తయి ఇంట్లో విందు చేస్తున్నప్పుడు, చాలా మంది పన్ను వసూలు చేసేవారు మరియు పాపులు వచ్చి అతనితో మరియు అతని శిష్యులతో కలిసి భోజనం చేశారు. పరిసయ్యులు అది చూసి, “మీ గురువు పన్ను వసూలు చేసేవారితో, పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నారు” అని ఆయన శిష్యులను అడిగారు. అది విన్న యేసు, “వైద్యుని అవసరం ఆరోగ్యవంతులకు కాదు, రోగులకు. అయితే వెళ్లి దీని అర్థం ఏమిటో నేర్చుకోండి: ‘నేను దయను కోరుకుంటున్నాను, బలిని కాదు.’ ఎందుకంటే నేను నీతిమంతులను కాదు, పాపులను పిలవడానికి వచ్చాను.”[1]

ప్రజలను ఆధ్యాత్మికంగా చేరుకోవడానికి ప్రయత్నించే ముందు వారిని మరియు వారి అవసరాలను వ్యక్తిగత స్థాయిలో తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గమని యేసు అర్థం చేసుకున్నాడు. అయితే ఈరోజు ఆయన మాదిరిని అనుకరించే విషయంలో వరల్డ్ అడ్వెంటిస్ట్ చర్చి సభ్యులు ఎలా కొలుస్తారు? ఈ బ్లాగ్‌లో, మేము ఈ అంశంపై ట్రాన్స్-యూరోపియన్ (TED) మరియు ఇంటర్-యూరోపియన్ (EUD) విభాగాల నుండి డేటాను పరిశీలిస్తాము.

విభజన సమాచారం

ఆఫీస్ ఆఫ్ ఆర్కైవ్స్, స్టాటిస్టిక్స్ మరియు రీసెర్చ్ (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) తరపున ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ (దేవాలయ సేవ సంస్థ) నిర్వహించిన 2017-2018 ప్రపంచ సంఘ సభ్యుల సర్వే (2017–18 GCMS) లో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల నుండి డేటా సేకరించబడింది.

  • ట్రాన్స్-యూరోపియన్ (మధ్య- యూరోపియన్) విభజన (TED) ఈ క్రింద పేర్కొన బడిన అడ్వెంటిస్ట్ చర్చి (సంఘముల) యొక్క పనిని పర్యవేక్షిస్తుంది: అలంద్ దీవులు, అల్బేనియా, బోస్నియా మరియు హెర్జెగోవినా, క్రొయేషియా, డెన్మార్క్, ఎస్టోనియా, ఫారో దీవులు, ఫిన్‌లాండ్, గ్రీస్, గ్రీన్‌ల్యాండ్, గ్వెర్న్సీ, హంగేరి, ఐస్‌లాండ్, ఐర్లాండ్, ఐల్ ఆఫ్ మ్యాన్, జెర్సీ, లాట్వియా, లిథువేనియా, మాసెడ్‌నెగ్రో (మాజీ యుగోస్లావ్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాకు కొత్త పేరు – 2019), నార్వే, పోలాండ్, సెర్బియా, స్లోవేనియా, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు నార్తర్న్ ఐర్లాండ్ మరియు సైప్రస్ యొక్క దక్షిణ భాగం; అడ్రియాటిక్, బాల్టిక్, బ్రిటీష్, హంగేరియన్, నార్వేజియన్, పోలిష్ మరియు సౌత్-ఈస్ట్ యూరోపియన్ యూనియన్ సమావేశాలను కలిగి ఉంటుంది; డానిష్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ మరియు స్వీడిష్ యూనియన్ ఆఫ్ చర్చిల సమావేశాలు; మరియు సైప్రస్ ప్రాంతం, గ్రీక్ మిషన్ మరియు ఐస్లాండ్ కాన్ఫరెన్స్. మొత్తం 11 (మధ్య- యూరోపియన్) TED యూనియన్ల నుండి మొత్తం 1,331 సర్వేలు ఉపయోగించబడ్డాయి. ప్రతివాదులలో దాదాపు సగం మంది (52%) స్త్రీలు మరియు 48% పురుషులు. పాల్గొనే వారందరి సగటు వయస్సు 49.4 సంవత్సరాలు.
  • ఇంటర్-యూరోపియన్ డివిజన్ (EUD) అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెకియా, ఫ్రాన్స్, జర్మనీ, జిబ్రాల్టర్, హోలీ సీ, ఇటలీ, లిక్టెన్‌స్టెయిన్, లక్సెంబర్గ్, మాల్టా, మొనాకో, పోర్చుగల్, రొమేనియా, శాన్ మారినో, స్లోవేకియా, స్పెయిన్ మరియు స్విట్జర్లాండ్; చెక్-స్లోవేకియన్, ఫ్రాంకో-బెల్జియన్, నార్త్ జర్మన్, రొమేనియన్, సౌత్ జర్మన్ మరియు స్విస్ యూనియన్ కాన్ఫరెన్స్‌లను కలిగి ఉంటుంది; ఆస్ట్రియన్, బల్గేరియన్, ఇటాలియన్, పోర్చుగీస్ మరియు స్పానిష్ యూనియన్ ఆఫ్ చర్చిల సమావేశాలు. EUDలోని పరిశోధకులు 11 యూనియన్ల నుండి 3,865 సర్వేలను సేకరించారు. ప్రతివాదులలో సగానికి పైగా (54%) స్త్రీలు మరియు 45% పురుషులు (తప్పిపోయిన డేటా = 1%). ప్రతివాదుల సగటు వయస్సు 51.53 సంవత్సరాలు.

క్రీస్తు పద్ధతి యొక్క ప్రభావం

2017–18 GCMS (2017-2018 ప్రపంచ సంఘ సభ్యుల సర్వే) లో పాల్గొనేవారిని “క్రీస్తు కోసం ప్రజలను చేరుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వారితో కలిసిపోయి, వారి అవసరాలను తీర్చడం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం, ఆపై క్రీస్తును అనుసరించమని వారిని కోరడం” అని నమ్ముతున్నారా అని అడిగారు. ఈ ప్రత్యేకమైన అడ్వెంటిస్ట్ నమ్మకం ఎల్లెన్ జి. వైట్ యొక్క పుస్తకం, ది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ హీలింగ్ ఆధారంగా రూపొందించబడింది. TED (మధ్య- యూరోపియన్) లోని మెజారిటీ (90%) సభ్యులు ప్రజలను చేరుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం అని ఒక స్థాయి లేదా మరొక స్థాయికి అంగీకరించారు. EUD (అంతర్- యూరోపియన్) లోని ప్రతివాదులు ఇంకా పెద్ద సంఖ్యలో (94%) అంగీకరించారు. తమ దేశాల్లోని దేవుని రాజ్యం కోసం ప్రజలను చేరుకోవడానికి క్రీస్తు పద్ధతిని అనుసరించడం అత్యంత ప్రభావవంతమైన మార్గమని రెండు యూరోపియన్ విభాగాలలోని సభ్యులు అర్థం చేసుకున్నారని స్పష్టమవుతోంది. ఆసక్తికరంగా, EUD (అంతర్- యూరోపియన్) “గట్టిగా అంగీకరిస్తుంది” ప్రతిస్పందనలు TED (మధ్య- యూరోపియన్) “గట్టిగా అంగీకరిస్తాయి” ప్రతిస్పందనలను 13.5 శాతం పాయింట్లతో అధిగమించాయి.

అవసరాలను అర్థం చేసుకోవడం

ఇదే పంథాలో, “వ్యక్తులకు చేరువ కావాలంటే మనం ముందుగా వారిని మరియు వారి అవసరాలను తెలుసుకోవాలి” అని అంగీకరిస్తారా అని సభ్యులను అడిగారు. TED (మధ్య- యూరోపియన్) లో, 82% మంది ప్రతివాదులు ఈ ప్రకటనతో ఒక డిగ్రీ లేదా మరొకదానికి అంగీకరించారు; అయినప్పటికీ, 10% మంది తమకు ఖచ్చితంగా తెలియదని అంగీకరించారు మరియు మిగిలిన 8% వారు అంగీకరించలేదు (అంటే, వ్యక్తులను తెలుసుకోవడం మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం వారిని చేరుకోవడంలో ముఖ్యమైన భాగం కాదు). మళ్ళీ, EUD (అంతర్- యూరోపియన్) లోని ఎక్కువ సంఖ్యలో (91%) సభ్యులు మనం వారికి సువార్త ప్రకటించే ముందు వారిని మరియు వారి అవసరాలను తెలుసుకోవడం ముఖ్యం అని ఒక డిగ్రీ లేదా మరొకదానికి అంగీకరించారు. EUD (అంతర్- యూరోపియన్) ప్రతివాదులు 5% మాత్రమే ఖచ్చితంగా తెలియలేదు మరియు కొద్ది శాతం మంది అంగీకరించలేదు (3%).

ఆ విధంగా, 2017–18 GCMS డేటా TED మరియు EUD రెండింటిలోని అడ్వెంటిస్ట్ సభ్యులు ప్రజలతో సువార్తను పంచుకునే ముందు వారి అవసరాలను అర్థం చేసుకోవడం, అలాగే క్రీస్తు పద్ధతిని అమలు చేయడం వంటి వాటి ప్రాముఖ్యతపై మంచి అవగాహనను ప్రదర్శించినట్లు చూపిస్తుంది. లౌకిక దేశాలలో పెద్దగా నివసిస్తున్న వారు ఈ అభిప్రాయాన్ని పంచుకోవడం మరింత లోతైనది. ఆసక్తికరంగా, పోల్చి చూస్తే, EUDలో ఎక్కువ మంది పాల్గొనేవారు ప్రజలను చేరుకోవడానికి ప్రభావవంతమైన మార్గంగా క్రీస్తు పద్ధతికి తమ మద్దతును చూపించారు. ప్రపంచ చర్చి ప్రజల అవసరాలకు పరిచర్య చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా మరియు లౌకిక సందర్భాలలో ప్రజలను చేరుకోవడానికి వచ్చినప్పుడు ఈ విభాగాలను ఉదాహరణలుగా ఉపయోగించాలి.

సంవత్సరం చివరి నాటికి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: “ఈ విధానంపై మన అభిప్రాయాలు ఏమిటి? మరియు మరింత ముఖ్యంగా, ఈ భూమిపై క్రీస్తు అవతారానికి అంకితమైన సెలవు దినాలలో నేను ఈ పద్ధతిని ఎలా అమలు చేయగలను? ఆ పద్ధతిని ఆచరణలో పెట్టకపోతే నమ్మడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా?”

TED గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు వారి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయవచ్చు: https://ted.adventist.org.

మీరు పూర్తి TED 2017–18 GCMS నివేదికను కూడా hక్కడ యాక్సెస్ చేయవచ్చు.

EUD గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు వారి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: https://eud.adventist.org/en/.

మీరు పూర్తి EUD 2017–18 GCMS నివేదికను కూడా ఇక్కడ యాక్సెస్ .

ఈ ప్రశ్నపై మొత్తం ఫలితాల కోసం ASTR బ్లాగ్ కీప్ క్రైస్ట్ ఇన్ క్రిస్మస్ (క్రిస్మస్ లో క్రీస్తు ఉంచండి)
కూడా చూడండి.


( Institute of Church Ministry) ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది

12-22-2021న ASTR ద్వారా ప్రచురించబడింది


[1] The Bible – New International Version, Matthew 9:9-13

[2] Ellen G. White, The Ministry of Health and Healing, p 143