ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ లో పాల్గొనేవారి చర్చి స్థానాలు: ఈ డేటా అంటే ఏమిటి? - – భాగం 2

బ్లాగ్ సెప్టెంబర్ 21, 2022

మా చివరి బ్లాగ్‌లో, చర్చి సభ్యులు వివిధ హోదాల్లో ఎంత తరచుగా సేవ చేస్తారో మరియు మొత్తం కుటుంబం కోసం చర్చి కార్యకలాపాలను ప్లాన్ చేస్తే స్థానిక చర్చి యొక్క స్థానం ఎలా ప్రభావితం చేస్తుందో మేము చూశాము. అయితే, మీరు ఆశ్చర్యపోవచ్చు, “చర్చి యొక్క స్థానం సమాజంలోకి-ప్రత్యేకంగా అడ్వెంటిస్టులు కాని వారిపై ఎలా ప్రభావం చూపుతుంది?” 2017–2018 ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ నాయకులు (2017–18 GCMS) ప్రతివాదులను దాని గురించి ప్రశ్నలు అడిగారు; ఈ ఫలితాలు ప్రతివాదుల స్థానిక చర్చి అమరిక తో క్రాస్-టేబుల్ (అడ్డ పట్టిక) చేయబడ్డాయి.

అడ్వెంటిస్టులు కాని వారికి సాక్షమిచ్చారు

సర్వే ప్రతివాదులు గత సంవత్సరంలో అడ్వెంటిస్టులు కాని వారికి ఎంత తరచుగా సాక్ష్యమిచ్చారని అడిగినప్పుడు, శివారు ప్రాంతాల్లోని చర్చికి హాజరైన సభ్యులు (43%) దాదాపు ప్రతి వారం లేదా అంతకంటే ఎక్కువసార్లు అడ్వెంటిస్టులకు సాక్ష్యమిచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతంలో (42%) లేదా పట్టణం/గ్రామంలో (41%) చర్చికి హాజరయ్యారు. ఒక పెద్ద నగరంలో వేరే చోట చర్చికి హాజరైన వారు గత సంవత్సరంలో అడ్వెంటిస్టులు కాని వారికి సాక్ష్యమివ్వాల్సి వచ్చే అవకాశం చాల తక్కువ (33%).


అడ్వెంటిస్ట్ చర్చి కి సామీప్యం లో అడ్వెంటిస్ట్ సంస్థ ఉండుట వలన నాన్-అడ్వెంటిస్ట్‌లకు (అడ్వెంటిస్ట్‌లు కాని వారికి) సాక్ష్యమివ్వడానికి మరియు/లేదా సంఘస్థుల ప్రమేయాన్ని అడ్వెంటిస్ట్ సంస్థ యేమి ప్రభావితం చేసినట్లు కనిపించలేదు.

అడ్వెంటిస్టులు కానివారి అవసరాలను తీర్చడం

మునుపటి ప్రశ్నకు ట్యాగ్ చేస్తూ (సంబంధించిన విధంగ) , ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ బృందం ప్రతివాదులను తమ కమ్యూనిటీలలో అడ్వెంటిస్టులు కానివారి అవసరాలను తీర్చడానికి గత సంవత్సరంలో ఎంత తరచుగా సమయాన్ని వెచ్చించారు అని కూడా అడిగారు. శివార్లలోని చర్చికి హాజరయ్యే ప్రతివాదులు, దాదాపు ప్రతి వారం లేదా అంతకంటే ఎక్కువ తరచుగా అడ్వెంటిస్టులు కానివారి అవసరాలను తీర్చినట్లు నివేదించే అవకాశం (41%). గ్రామీణ ప్రాంతంలో చర్చికి హాజరైన దాదాపు ఐదుగురిలో ఇద్దరు (39%) సర్వేలో పాల్గొన్నవారు ఇదే విషయాన్ని నివేదించారు. పెద్ద నగరంలో (28%) మరియు చిన్న నగరంలో (30%) చర్చికి హాజరైన వారు గత సంవత్సరంలో తమ సంఘంలోని అడ్వెంటిస్టులు కానివారి అవసరాలను తీర్చడానికి సమయాన్ని వెచ్చించే అవకాశం చాల తక్కువ.

మళ్ళీ, అడ్వెంటిస్ట్ సంస్థకు చర్చి యొక్క సామీప్యత, అడ్వెంటిస్టులు కానివారి అవసరాలను తీర్చడంలో సభ్యుల సుముఖత మరియు/లేదా ప్రమేయంపై ప్రభావం చూపలేదు.

అడ్వెంటిస్టులు కాని వారితో కొత్త స్నేహాన్ని ఏర్పరుచుకోవడం

చివరగా, ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ బృందం (2017-18 GCMS) ప్రతివాదులను “అడ్వెంటిస్టులు కాని వారితో కొత్త స్నేహాన్ని ఏర్పరచుకోవడానికి గత సంవత్సరంలో ఎంత తరచుగా సమయాన్ని వెచ్చించారు” అని అడిగారు. గ్రామీణ ప్రాంతాలలో (48%) మరియు శివారు ప్రాంతాలలో (47%) ప్రతివాదులు దాదాపు ప్రతి వారం లేదా అంతకంటే ఎక్కువ తరచుగా ఇటువంటి స్నేహాలను ఏర్పరచుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. ఒక పెద్ద నగరంలో వేరే చోట చర్చికి హాజరైన వారు అలా చేసే అవకాశం చాల తక్కువగా (37%) ఉంది.

ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ (2017-18 GCMS) బృందం సేకరించిన సమాచారం ప్రకారం, అడ్వెంటిస్ట్ సంస్థకు చర్చి సామీప్యత కమ్యూనిటీలో అడ్వెంటిస్టులు కాని వారితో స్నేహాన్ని ఏర్పరుచుకోవడంలో సభ్యుల ప్రమేయాన్ని ప్రభావితం చేయలేదు.

గత రెండు పట్టికలలో/ పత్రికలలో భాగస్వామ్యం చేయబడిన ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నాయా? ఒక నగరంలో నివసించే వారు ఒకరికొకరు సామీప్యంగా జీవించినప్పటికీ, వారు మరింత విడిగా, ఏకాంత జీవితాలను గడుపుతున్నారా? చిన్న సమాజాలలో నివసించే వారు ఒకరి జీవితాలలో మరొకరు పాలుపంచుకుంటున్నారా? ఇలాంటి విషయములలో మీ స్వంత చర్చి స్థానాన్ని పరిగణించండి. మీరు ఇలాంటి కార్యకలాపాల్లో ఎంత తరచుగా పాల్గొంటున్నారు?

ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ లో పాల్గొనేవారి చర్చి స్థానాలు: ఈ (సమాచారం) అంటే ఏమిటి?
పార్ట్ 1 ఇక్కడ చూడవచ్చు

మొత్తం నమూనాపై మరిన్ని పరిశోధన ఫలితాల కోసం, దయచేసి మెటా-విశ్లేషణ నివేదికను చూడండి( Meta-Analysis Report).


ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ (Institute of Church Ministry) సహకారంతో రూపొందించబడింది

09-21-2022 తేదీన ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది