స్థానిక చర్చి ప్రమేయం యొక్క సారాంశం: చర్చి కార్యాలయంలో నాయకత్వం వహించడం

బ్లాగ్ మార్చి 1, 2023

చర్చిలో ఉన్నవారు, బోధన, భవనం, తయారీ మరియు వ్యవసాయం వంటి వివిధ రకాలైన వృత్తిలో నిమగ్నమవ్వడానికి తగినంత ప్రతిభను కలిగిన వారు, సాధారణంగా కమిటీలలో (నిర్దిష్ట విధిని నిర్వహించడానికి ఎంచుకున్న వ్యక్తుల సమూహంతో కలిసి పనిచేయడం)
లేదా ఉపాధ్యాయులుగా సేవ చేయడం ద్వారా చర్చి యొక్క పునరుద్ధరణ కోసం శ్రమించడానికి సిద్ధంగా ఉండాలి. సబ్బాతుబడి, మిషనరీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదా చర్చితో అనుసంధానించబడిన వివిధ కార్యాలయాలలో పాల్గొనడం. – ఎల్లెన్ జి. వైట్, ది రివ్యూ అండ్ హెరాల్డ్, ఫిబ్రవరి 15, 1887.

చర్చి అధికారులు మరియు చర్చిలో నాయకత్వం వహించే సంఘ సభ్యులు ఏ స్థానిక చర్చికైనా వెన్నెముకగా ఉంటారన్నది రహస్యం కాదు. నియమిత నాయకులు (పెద్దలు మరియు సంఘ పరిచారకులు వంటివి), చర్చి పరిపాలనా నాయకులు (చర్చి గుమస్తా, కోశాధికారి లేదా చర్చి బోర్డు సభ్యుడు వంటివి), మరియు సాధారణ చర్చి అధికారులు (పిల్లల నాయకులు, కుటుంబ మంత్రిత్వ శాఖల సమన్వయకర్తలు, పాత్‌ఫైండర్ డైరెక్టర్ లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖల నాయకుడు -కొన్ని పేరు చెప్పాము అంతె), ఈ వ్యక్తులు స్థానిక చర్చి జీవితాన్ని నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహిస్తారు.

చర్చి కార్యాలయాన్ని నిర్వహించడంపై ప్రపంచ పరిశోధనాత్మిక మైన అంశాలు

2017–18 ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ బృందం (2017–18 GCMS) అడ్వెంటిస్ట్ చర్చిలో సభ్యుల అనుభవాలకు సంబంధించిన అనేక అంశాలను, అడ్వెంటిస్ట్ సిద్ధాంతాలు మరియు బోధనలపై వారి నమ్మకాలతో పాటుగా పరిశీలించింది. పరిశోధించబడిన ఒక నిర్దిష్ట ప్రాంతం చర్చి కార్యాలయాన్ని నిర్వహించడం ద్వారా వారి స్థానిక చర్చిలో సభ్యుల ప్రమేయం. దాదాపు ముగ్గురిలో ఇద్దరు (62%) సర్వే ప్రతివాదులు తమ స్థానిక చర్చిలో ప్రస్తుతం చర్చి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని నివేదించారు. మిగిలిన 38% మంది చర్చి కార్యాలయాన్ని కలిగి లేరని పంచుకున్నారు.

విభజన ద్వారా క్రాస్-టేబుల్ చేయబడినప్పుడు, యూరో-ఆసియా డివిజన్ (ESD) నుండి దాదాపు ఐదుగురు (80%) ప్రతివాదులు చర్చి కార్యాలయాన్ని కలిగి ఉన్నారని డేటా చూపించింది; ఈ సంఖ్య ఇతర విభాగాల కంటే చాలా ఎక్కువగా ఉంది మరియు స్థానిక చర్చికి సేవ చేయడంలో అధిక స్థాయి నిబద్ధతను సూచిస్తుంది. యూరో-ఆసియా డివిజన్ (ESD) తర్వాత దక్షిణాసియా విభాగం (SUD) (73%), తూర్పు-మధ్య ఆఫ్రికా విభాగం (ECD), ట్రాన్స్-యూరోపియన్ డివిజన్ (TED), మరియు పశ్చిమ-మధ్య ఆఫ్రికా విభాగం (WAD) (ఒక్కొక్కటి 71%). సదరన్ ఆసియా-పసిఫిక్ డివిజన్ (SSD) నుండి ప్రతివాదులు అత్యల్ప స్థాయి ప్రతివాదులు చర్చి కార్యాలయాన్ని (47%) కలిగి ఉన్నారని నివేదించారు, అయినప్పటికీ అది సగానికి దగ్గరగా ఉంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే 2017-17 ప్రపంచ సంఘ సభ్యుల వీక్షణ బృందం (2017–18 GCMS) ఇలాంటి డేటాను సమీక్షించేటప్పుడు క్రమం తప్పకుండా చర్చికి హాజరయ్యే వారు మరియు చర్చి జీవితంలో ఎక్కువగా నిమగ్నమైన వారి ద్వారా భర్తీ చేయించబడి ఉండవచ్చు. (అంటే, సర్వేలో పాల్గొనడానికి వారికి మరిన్ని అవకాశాలు అందించబడ్డాయి). పర్యవసానంగా, ఈ నమూనా చర్చి జీవితంలో పాల్గొన్న వారి సగటు కంటే ఎక్కువ శాతం కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చర్చి జీవితం యొక్క సారాంశాన్ని పరిశీలించడం ఆసక్తికరంగా, ఆశాజనకంగా మరియు ప్రోత్సాహకరంగాను ఉంది.

సంఘ సభ్యుల నాయకత్వంలోని ప్రాముఖ్యత

ఈ విలువైన సమీక్షణ మనలో ప్రతి ఒక్కరిని మన స్థానిక చర్చిలో చురుకైన పాత్రను పోషించమని కోరుతున్నట్లుగాను
గుర్తుచేస్తున్నట్లు గాను పనిచేస్తుంది. చర్చి శరీరంలో భాగం కావడం అనేది వినియోగించదగిన అనుభవంగా భావించబడదు; మనం దేవాలయానికి వెళ్లి దైవ్య వాక్యాన్ని ఆరగించి వెళ్లిపోవడానికి మాత్రమే హాజరు కాకూడదు. బదులుగా, చర్చి అనేది మనం ఇవ్వడానికి మరియు స్వీకరించడానికి, మరియు సేవ చేయడానికి ఒక ప్రదేశంగా ఉండాలి. చర్చి కార్యాలయాన్ని నిర్వహించడంతోపాటు చర్చి జీవితంలో పాల్గొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందరూ చర్చి నాయకులైతే, మరి నాయకత్వం ని ఎవరు స్వీకరిస్తారు? ప్రతి గొప్ప చర్చి నాయకుడి వెనుక నాయకత్వం వహించడానికి సహాయపడే బృందం ఉంటుంది. చర్చి సభ్యులు ఎంత ప్రమేయం కలిగి ఉన్నారో ఈ సమీక్షణ మనకి చూపించనప్పటికి, సాధారణ చర్చి నాయకులు అవసరమని అర్థం చేసుకోవడానికి ఇది మనకి సహాయపడుతుంది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చి సభ్యుల ప్రమేయం, మరియు నాయకత్వం యొక్క స్నాప్‌షాట్‌ను (సమీఖ్యతను) చూపుతుంది. “నా స్థానిక చర్చికి సేవ చేయడంలో నేను ఎంత మెరుగ్గా పాల్గొనగలను?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే సమయం ఇది కావచ్చు.

చర్చి నాయకులు మరియు చర్చి జీవితంలో చర్చి సభ్యుల ప్రమేయం గురించి మరింత సమాచారం కోసం దయచేసి ఈ మునుపటి ప్రచురించిన బ్లాగులను చదవండి:

మొత్తం నమూనాపై మరిన్ని పరిశోధన ఫలితాల కోసం, దయచేసి మెటా-విశ్లేషణ నివేదికను (Meta-Analysis Report) చూడండి.


ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది.

03/01/2023న ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది