చర్చి సభ్యత్వం యొక్క గణాంకాల సేకరణ

బ్లాగ్ ఏప్రిల్ 10, 2024
"...పశ్చాత్తాపపడే ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంది..." (లూకా 15:7, NIV) అనే బైబిల్ సత్యాన్ని మేము దృఢంగా విశ్వసిస్తాము. దేవుని కుటుంబంగా, చర్చి కూడా కొత్త సభ్యులను గుడి(సంఘం) లోకి చేర్చినప్పుడు సంతోషిస్తుంది. ఈ సంతోషం సభ్యత్వంలో సాధారణ గణాంక పెరుగుదల గురించి కాదు, చాలా ముఖ్యమైనది, ఇది మన సోదరులు మరియు సోదరీమణుల మోక్షానికి సంబంధించినది.
ఇటీవలి 2023 వార్షిక గణాంక నివేదికలో, కోవిడ్-19 మహమ్మారి 2019 నుండి 2022 వరకు మా చర్చి ప్రవేశ సంఖ్యలను ఎలా ప్రభావితం చేసిందనే దానిపై మేము డేటాను ప్రచురించాము. 2020లో కోవిడ్-19 ఎక్కువగా ప్రభావితమైన చాలా విభాగాలలో,  ప్రవేశాలు బాగా తగ్గాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. 
2021లో చాలా ప్రాంతాలలో, సభ్యత్వం సంఖ్య పుంజుకోవడం ప్రారంభించాయి మరియు 2022లో మరింత పుంజుకోవడం ప్రారంభించింది. అయితే, దక్షిణ పసిఫిక్ విభాగం (SPD)లో, 2020లో సభ్యత్వం సంఖ్యలో అరుదైన 25% పెరుగుదల ఉంది కాని తరువాత రెండు సంవత్సరాల్లో సభ్యత్వం క్షీణత కనిపించింది. . దక్షిణ ఆసియా-పసిఫిక్ విభాగం  (SSD)లో, ప్రవేశాలు 2019 నుండి 2020 వరకు స్థిరంగా ఉన్నాయి మరియు ఆ తర్వాత గణనీయంగా పుంజుకున్నాయి.

5 సంవత్సరాలకు పైగా విభాగాల వారీగా సభ్యత్వం పెరుగుదల

ECD = ఇసిడి   ESD =  ఇఎస్‌డి   EUD = ఇయుడి   IAD =  ఐఎడి   NAD =  ఎన్ఎడి   NSD = ఎన్ఎస్‌డి   SAD =  ఎస్‌ఎడి   SID =   ఎస్ఐడి   SPD = ఎస్ పి డి   SSD =  ఎస్ఎస్డి   SUD =  ఎస్యుడి   TED =   టిఇడి   WAD = డబ్లూఎడి   Attached Fields = జోడించిన విభాగాలు

ఉత్తర ఆసియా-పసిఫిక్ విభాగం(NSD) మరియు దక్షిణ ఆసియా విభాగం (SUD) వంటి కొన్ని విభాగాలు కోవిడ్-పూర్వ సంఘ సభ్యుల సంఖ్యలకు నెమ్మదిగా పునరాగమనం చేయడం కూడా గమనార్హం. ప్రతి డివిజన్‌లో, ప్రపంచవ్యాప్త చర్చిలలో సంఘ సభ్యత్వం పై కోవిడ్-19 గణనీయమైన ప్రభావాన్ని చూపిందని స్పష్టమైంది. 

10 సంవత్సరాలలో ప్రపంచ సంఘ సభ్యత్వం పెరుగుదల

2020లో సంఘ సభ్యత్వం పెరుగుదల నాటకీయంగా తగ్గిన తర్వాత 2022లో సంఘ సభ్యత్వం పెరుగుదలలు గణనీయంగా పుంజుకోవడం ప్రోత్సాహకరంగా ఉంది. కోవిడ్-19 ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ, 2022లో సంఘ సభ్యత్వం పెరుగుదలలు గత 23 సంవత్సరాల నుండి 19లో 1 మిలియన్ మార్కును అధిగమించాయని ఇది చూపిస్తుంది. గత 23 సంవత్సరాలు.
2020లో, సంఘ సభ్యత్వం సంఖ్యలు 803,430కి పడిపోయాయి, కానీ 2022లో అవి 1,358,309కి పెరిగాయి, అంటే ఇది 69%  పెరుగుదల. దాదాపు ప్రతి డివిజన్ యొక్క ప్రవేశం 2020 నుండి 2022 వరకు పెరిగింది. వాస్తవానికి, తూర్పు-మధ్య ఆఫ్రికా విభాగం (ECD)లో ప్రవేశాలు 108% మరియు దక్షిణాఫ్రికా-ఇండియన్ ఓషన్ విభాగం (SID)లో 159% పెరిగాయి. మన సంఘ సభ్యత్వం చర్చి పెరుగుతూనే ఉంది; దాని గురించి దేవునికి కృతజ్ఞ్యతలు!
మనము సంఘ సభ్యత్వంలో ఈ గణనీయమైన వృద్ధిని జరుపుకుంటున్నప్పుడు, కొత్త సభ్యులను చర్చి కుటుంబంలో ఉంచడానికి మేము వారి సంరక్షణను సమానంగా ప్రోత్సహించాలి. చర్చిలో కొత్త సభ్యులు చేరడం ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో, అదే విధంగ కొంతమంది సభ్యులు చర్చిని విడిచిపెట్టి వెళ్ళడం చూసినప్పుడు హృదయాన్ని బాధిస్తుంది.  
మీరు పూర్తి నివేదికను ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.
ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది.
04/10/2024న ASTR (చరిత్ర, గణాంకాలు మరియు పరిశోధన దస్తావేజులు భద్రపరుచు కార్యాలయం)  ద్వారా ప్రచురించబడింది.