పాస్టర్ల భావోద్వేగ ఆరోగ్యం మరియు శ్రేయస్సు: ఆరోగ్యకరమైన సరిహద్దులు

బయట ఉన్న పెద్ద సర్కిల్ కోసం అంతర్గత వృత్తాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ప్రధాన కార్యదర్శిని (దైవసేవకుని) ఏమీ క్షమించలేము. అతని కుటుంబం యొక్క ఆధ్యాత్మిక సంక్షేమం మొదటి స్థానంలో ఉంటుంది. అంతిమ గణన రోజున దేవుడు దైవసేవకుని తాను ఈ లోకానికి తీసుకువచ్చి బాధ్యతను స్వీకరించిన తన కుటుంబాన్ని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి అతను ఏమి చేసాడో విచారిస్తాడు. ఇతరులకు చేసిన గొప్ప మేలు తన స్వంత పిల్లలను చూసుకోవడానికి దేవునికి అతను చెల్లించాల్సిన రుణాన్ని రద్దు చేయలేము. (వైట్, ది అడ్వెంటిస్ట్ హోమ్, 1952, పేజి 353)

ఈ వారం బ్లాగ్ పాస్టర్ల మానసిక ఆరోగ్యానికి సంబంధంచింది మరియు, ‘ఇది మెండింగ్ మినిస్టర్స్ ఆన్ దేర్ వెల్‌నెస్ జర్నీ’ (పాస్టర్లకు వారి ఆరోగ్య యాత్రలో చేయుతనివ్వుట),[1] అనే పుస్తకం నుండి తీసుకోబడింది; ఇది ఉత్తర అమెరికా విభాగం[2] (NAD) లోని అడ్వెంటిస్ట్ పాస్టర్ల ఆరోగ్యంపై ఇటీవల చేసిన పరిశోధన ఆధారంగా రూపొందించబడింది.

ఆక్సిజన్ మాస్క్‌లను (ప్రాణ వాయువు ముసుగులను) విడుదల చేసినప్పుడు , ఇతరులకు సహాయం చేయడానికి ముందు వారు తమ స్వంత ముసుగులను సర్దుబాటు చేసుకోవాలని విమానంలో ప్రయాణీకులకు ఇచ్చిన సూచనల ఉదాహరణను మెండింగ్ మినిస్టర్స్ (పాస్టర్లలను బాగుచేయడం) అనే పుస్తకం లో సూచించారు. ఇది స్వీయ సంరక్షణ యొక్క సారాంశం. ఇతరులను చూసుకునే ముందు మన గురించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పాస్టర్‌లకు ఇది చాలా కీలకం, వారు తమను మరియు వారి కుటుంబాలను మాత్రమే కాకుండా ఇతరుల మొత్తం సమాజాలను జాగ్రత్తగా చూసుకోవాలి. పాస్టర్ల స్వీయ-సంరక్షణ యొక్క అత్యంత ముఖ్యమైన మరియు సమానంగా నిర్లక్ష్యం చేయబడిన అంశాలలో ఒకటి తమ చుట్టూ మరియు వారి కుటుంబాల చుట్టూ ఆరోగ్యకరమైన సరిహద్దులను సృష్టించడం. సరిహద్దులు మనకు మరియు ఇతర వ్యక్తుల మధ్య ఉద్దేశపూర్వక, ఆరోగ్యకరమైన ఖాళీలు. ఏది సరైంది మరియు ఏది కాదు, మనం ఏమి సహిస్తాం మరియు ఏది సహించలేము అని ప్రజలకు తెలియజేయడానికి అవి మనకి అనుమతిస్తాయి. సరిహద్దులు మనల్ని సురక్షితంగా ఉంచుతాయి. 2021 డ్రమ్ మరియు సింకాలా అధ్యయనంలో, పాస్టర్లకు మతపరమైన ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన సరిహద్దులను సృష్టించడం మరియు నిర్వహించడం చాలా కీలకమని పరిశోధకులు కనుగొన్నారు. సరిహద్దులు ఆరోగ్యకరమైన సంబంధాలను కాపాడతాయి, ముఖ్యంగా మనం ఎక్కువగా శ్రద్ధ వహించే వ్యక్తులతో.

అయినప్పటికీ, చాలా మంది పాస్టర్లు కుటుంబ సరిహద్దులను ఏర్పరచుకోవడంలో సమస్యలను కలిగి ఉన్నారు, ఎందుకంటే అలా చేయడం వలన వారు దేవుని అంచనాలకు అవిశ్వాసంగా ఉన్నారనే అపరాధ భావన వారికి కలిగిస్తుంది.

మరియు నేను అంగీకరించాలి. . . నన్ను నేను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలియదు మరియు నేను దానితో ఇంకా పోరాడుతున్నాను. నా ఉద్దేశ్యం, నేను పాస్టర్‌గా, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవాలి అనే నమ్ముతాను మరియు అపరాధభావంతో ఉండకూడదు. ఉదాహరణకు, “నేను ప్రస్తుతం ఫోన్ పిలుపుకి సమాధానం ఇవ్వలేను” లేదా, “నేను ఈ రోజు

సెలవు తీసుకోవాలి” అని చెప్పడం తప్పు కాదు. కానీ నేను అలా చేస్తుంటే, నాకు గిల్టీగా (తప్పు చేస్తున్నాననే అపరాధభావాన్ని) కలిగిస్తుంది, నేను నా పిలుపుకు నమ్మకంగా లేను అనే భావన కలిగిస్తుంది.[3]

కుటుంబ సరిహద్దు ఆందోళనలు

ఇతర సహాయ వృత్తుల కంటే పాస్టర్‌లు వ్యక్తిగత మరియు కుటుంబ సరిహద్దులను నిర్ణయించడంలో ఎక్కువ సవాళ్లను కలిగి ఉంటారు. పాస్టర్ల కోసం, వారి ఇల్లు మరియు వారి చర్చి మధ్య సరిహద్దులు పారగమ్యంగా (విస్తరించెవిధంగా) మారవచ్చు. సంఘ సభ్యులు తమ పాస్టర్‌ వారి కోసం అన్ని సమయాలలో అందుబాటులో ఉంటారని భావించవచ్చు. మరియు పాస్టర్‌గా ఉండటం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, పాస్టర్‌లు ఇంట్లో మరియు వారి కుటుంబాలతో విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు కూడా అందుబాటులో ఉండాలనే ఒత్తిడిని అనుభవిస్తారు (హిల్మాన్, 2008).[4]

పాస్టర్‌లు తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం స్వార్థపూరితంగా భావించవచ్చు, కానీ, విమానంలోని ఆక్సిజన్‌ (ప్రాణ వాయువు) లాగా, పాస్టర్‌లు తమ సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం శ్రద్ధ వహించే ముందు వారి యొక్కయు, మరియు వారి కుటుంబాల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. “ఆరోగ్యకరమైన సరిహద్దులు ఆరోగ్యకరమైన ఆత్మలను కలిగి ఉంటాయి. అనారోగ్య సరిహద్దులు అనారోగ్య ఆత్మలను కలిగిస్తాయి.”[5]

దేవునితో దగ్గర బంధాన్ని ఏర్పరచుకున్న తరువాత , పాస్టర్లు వారి కుటుంబాలతో బలాన్ని మరియు దైవ సేవ కొనసాగించడానికి కావలసిన ప్రేరణను పొందుతారు…

కుటుంబంతో సమయాన్ని కాపాడుకోవడానికి ఒక మార్గం యేమిటంటే క్యాలెండర్‌ (కాలక్రమ పట్టిక) లో కుటుంబ సమయాన్ని షెడ్యూల్ చేయడం (వ్రాసిపెట్టండి).

అదే విధంగా, పాస్టర్లు సాధారణ చర్చి కార్యాలయ పని కోసం సమయ పరిమితులను సెట్ చేయాలి (నిర్ణయించి పెట్టుకోవాలి). వాస్తవానికి, నిజమైన అత్యవసర పరిస్థితికి ప్రతిస్పందించడానికి మంచి పాస్టర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు, అయితే అత్యవసర పరిస్థితి ఏమిటో ముందుగానే నిర్వచించడం అవసరం.

మెండింగ్ మినిస్టర్స్ (పాస్టర్లను ఆరోగ్యంగా ఉంచడం) 1 అనే పుస్తకం కుటుంబం మరియు పని మధ్య ఆరోగ్యకరమైన సరిహద్దులను నిర్వహించడానికి పాస్టర్లు చేయగలిగే కొన్ని విషయాలపై సమాచారాన్ని అందిస్తోంది.[6]

  1. 1. కాదు అని చెప్పడం నేర్చుకోండి: “నో” అనేది పూర్తి వాక్యం మరియు క్షమాపణ లేదా వివరణ అవసరం లేదు.
  • 2. మీకు కావలసినది (మరియు వద్దు) అనే విషయం వివరంగా తెలిజేయండి: సరిహద్దులను నిర్ణయించడంలో స్పష్టమైన సంభాషణ చాలా ముఖ్యమైనది.
  • 3. ఒక “లేకుంటే . . . ఆపై” నిరీక్షణను అనుసరించండి: మీ అంచనాలు ఏమిటో మరియు అవి ఉల్లంఘించబడితే ఏమి ఆశించాలో ముందుగానే తెలుసుకోండి.

ఆరోగ్యకరమైన సరిహద్దులను సృష్టించడం మరియు నిర్వహించడం చాలా కష్టమైన పని, మరియు పాస్టర్‌లు తమపై మరియు వారి కుటుంబంపై దృష్టి కేంద్రీకరించడానికి పని నుండి సమయం తీసుకున్నప్పుడు కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు మరియు నిర్లక్ష్యం చేయబడ్డట్లు అనుకోవచ్చు, అయినాసరే పాస్టర్లు వారి చర్చి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికీగాను, తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.


ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మినిస్ట్రీ సహకారంతో రూపొందించబడింది (Institute of Church Ministry).

9/27/23 వ తేదీన ASTR (చరిత్ర, గణాంకాలు, పరిశోధన అంశాలను భద్రపరుచు కార్యాలయం) ద్వారా ప్రచురించబడింది.


[1] Ivan Williams, Petr Činčala, and René Drumm, eds., Mending Ministers on Their Wellness Journey (Lincoln, NE: AdventSource, 2022).

[2] R. Drumm and P. Činčala, SDA Pastor Health Qualitative Study Report: What Can

and Must Be Done to Save the Health of Adventist Pastors. Unpublished Report to the North

American Division of Seventh-day Adventists Ministerial Department (2021b)

[3] Drumm and Činčala, What Can and Must Be Done, pg. 21

[4] L. Hileman, L., “The Unique Needs of Protestant Clergy Families: Implications for Marriage and Family Counseling,” Journal of Spirituality in Mental Health, 10:2 (2008): 119–144.

[5] Williams, Činčala, and Drumm, Mending Ministers, pg. 114.

[6] Williams, Činčala, and Drumm, Mending Ministers, pgs. 97–98.